ఎన్టీఆర్ హీరోగా సినిమా తీస్తా...: కళ్యాణ్‌ రామ్‌ ఇంటర్వ్యూ

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2015 (22:47 IST)
నిర్మాతగా 'కిక్‌2' నిరాశపర్చినా.. ఎవరినీ తప్పుపట్టలేననీ, అందరూ బాగా కష్టపడ్డారని గెలుపు ఓటములు దైవాదీనాలని కథానాయకుడు కళ్యాణ్‌రామ్‌ అంటున్నాడు. 'పటాస్‌' చిత్రంతో విజయపథంలో వున్న ఆయన తాజాగా 'షేర్‌' చిత్రంతో ఈ నెల 30న వస్తున్నాడు. మల్లిఖార్జున్‌ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా గురించి కళ్యాణ్‌ రామ్‌తో ఇంటర్వ్యూ..
 
షేర్‌ ఎలా వుంటుంది?
ఇదొక రెగ్యులర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. గత చిత్రాల్లో వుండే ట్విస్ట్‌లు, భారీ డైలాగ్స్‌ ఇందులో వుండవు. సివిల్‌ ఇంజనీర్‌ చదివిన పాత్రలో కన్పిస్తాను. తండ్రికి నిర్మాణరంగంలో సాయం చేస్తుంటాను. మనస్సులో ఒకటి పెట్టుకుని బయట మరొటి చేసే క్యారెక్టర్‌ ఇది. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు వుంటే మంచిదే. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా సాధారణ సినిమా చూడ్డానికి వెళ్తున్నామని చూసే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది.
 
సినిమా ఆలస్యం కావడానికి కారణం?
'పటాస్‌' విజయం తర్వాత చేసే చిత్రం కనుక ఇందులో ఎటువంటి మార్పులు చేయలేదు. పటాస్‌కు ముందే ఈ కథను అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ పెంచాం. నాకూ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి అని చెప్పారు.
 
మిస్‌ ఇండియాను మార్చేశారే?
మొదట వేన్యా మిశ్రాను ఎంచుకున్నాం. ఆమెతో 10 రోజుల వర్క్‌ కూడా జరిగింది. బ్రహ్మానందంతో ఎపిసోడ్‌ కూడా చేశాం. కానీ ఎక్కడా పాటలు పిక్చరైజేషన్‌ చేయలేదు. రషెస్‌ చూశాక.. ఆమె పాత్రకు సరిపోవడంలేదని నటన బాగోలేదని.. కెమెరామెన్‌, దర్శకుడు అనుకున్నారు. దాంతో ఆమె స్థానంలో సోనమ్‌ చౌహాన్‌ను ఎంపిక చేయాల్సివచ్చింది. దీనివల్ల కూడా సినిమా ఆలస్యమైంది.
 
దర్శకుడుతో ఇంతకుముందు చిత్రాలు తీశారు. సక్సెస్‌ రాలేదు?
మల్లిఖార్జున్‌తో అభిమన్యు, కత్తి చిత్రాలు చేశాను. నా కెరీర్‌ ప్రారంభం నుండి కలిసి ప్రయాణం చేస్తున్నాడు. నేను ఏ దర్శకుడినైనా స్క్రిప్ట్‌ చెప్పేటప్పుడే అతనిలో ఎంత నమ్మకం వుందో గమనిస్తాను. కొత్త దర్శకులకు కూడా వారి నమ్మకాన్ని చూసే అవకాశాలిస్తాను. కొన్నిసార్లు కృషి వున్నా అపజయం కలుగవచ్చు. అందుకు ఎవరినీ నిందించవలసిన పనిలేదు. మల్లిలో ప్రతిభ వుంది. ఈ సినిమాను బాగా డైరెక్ట్‌ చేశాడు. టీం అందరిలో ఎక్కువగా కష్టపడింది తనే.
 
'ఓం' సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది?
ఇక సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌ అనేవి ఇక్కడ సహజమే. కానీ 3డి టెక్నాలజీతో 'ఓం' చిత్రాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టి.. మూడేళ్ళ కష్టపడి తీసుకువచ్చాక జనాలకు నచ్చకపోతే నిరాశకు గురయ్యాను. ఫెయిల్యూర్‌లో ఏఏ తప్పులు వున్నాయో సరిచేసుకోవడానికి అవకాశం వుంటుంది. విజయం వున్నప్పుడు తక్కువ ఆలోచిస్తాను. నాకు విభిన్న చిత్రాలంటే ఇష్టం. ఓంకు అనుకున్న ఫలితాలు రాకపోవడానికి ఫ్లాష్‌బ్యాక్‌ నెరేషన్‌ ఎక్కువగా వుండటం వంటి కొన్ని కారణాల వల్ల జనాలకు అర్థం కాలేదు. అందుకే ఇక ప్రయోగాత్మక చిత్రాలు చేసినా.. స్క్రీన్‌ప్లే, నెరేషన్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుని చేస్తాను.
 
ఇటీవలే ఆడియో వేడుకలో ఎమోషనల్‌ అయ్యారే?
నాకు ఫ్యామిలీ మ్యాన్‌లా వుండాలంటే ఇష్టం. సినిమాల్లో నా పాత్ర గురించి ఎవ్వరూ మాట్లాడినా పర్లేదు కానీ నిజ జీవితం గురించి మాట్లాడితే నచ్చదు. కుటుంబం పట్ల చాలా జాగ్రత్త తీసుకొని వుంటాను. ఎవరైనా నన్ను పాయింటఅవుట్‌ చేసి చూపిస్తే అస్సలు నచ్చదు. చాలా ఎమోషనల్‌ అయిపోతాను. మిగతా విషయాలు పట్టించుకోను. అందుకే ఆ రోజు ఎమోషనల్‌గా ఫీలయ్యాను.
 
ఎన్‌టిఆర్‌ సినిమా చూశారా?
(నవ్వుతూ) నా ప్రతి సినిమా ఎన్‌టిఆర్‌ చూస్తారు. పటాస్‌ చూశాడు. అలాగే ఈ సినిమా కూడా చూశాడు. మేమిద్దరం కలిసి ఏం మాట్లాడుకున్నా.. అది మా మధ్యనే వుంటుంది.
 
ఎన్‌టిఆర్‌తో సినిమా ఎప్పుడు?
ఎన్‌టిఆర్‌ హీరో మా బేనర్‌లో ఖచ్చితంగా సినిమా వుంటుంది. త్వరలో అధికారికంగా ప్రకటిస్తాను. ఇప్పుడిప్పుడే ఏవో గాసిప్‌లు రాసేస్తే బాగోదు.. చేసేది చాలా గ్రాండ్‌ చేసి అందరినీ పిలుస్తాను.
 
ఈ ఏడాది స్పీడ్‌ పెంచారే?
పటాస్‌ చిత్రం తర్వాత చాలామంది అలాంటి తరహా కథలే చెబుతున్నారు. దాంతో విసుగు కల్గింది. నేను కొత్తదనాన్ని, ప్రయోగాల్ని కోరుకుంటాను. అందుకే ఏడాదికి 2 సినిమాలు చేయాలనుకుంటున్నాను అని ముగించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

Show comments