Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 'ఇజం' సమాజం కోసం.. కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూ

కమ్యూనిజం, హ్యూమనిజం, ఫెమినిజం.. ఇలా ఎన్నో ఇజాలు తెలిసిందే. కానీ 'ఇజం' అనే సినిమాలో కొత్త ఇజం వుంటుందనీ, ఇలా వుంటేనే సమాజం బాగుంటుందనే అందరికీ అనిపిస్తుందని... కథానాయకుడు కళ్యాణ్‌ రామ్‌ అన్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై పూరీ జగన్నాథ్‌ ద

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (22:22 IST)
కమ్యూనిజం, హ్యూమనిజం, ఫెమినిజం.. ఇలా ఎన్నో ఇజాలు తెలిసిందే. కానీ 'ఇజం' అనే సినిమాలో కొత్త ఇజం వుంటుందనీ, ఇలా వుంటేనే సమాజం బాగుంటుందనే అందరికీ అనిపిస్తుందని... కథానాయకుడు కళ్యాణ్‌ రామ్‌ అన్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇజం'. పోస్ట్‌ప్రొడక్షన్‌ చివరి దశలో వున్న ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్‌తో ఇంటర్వ్యూ.
 
టైటిల్‌లో చాలా ఇజాలున్నాయి. మీరు చెప్పేది పూరీ ఇజమా? కళ్యాణ్‌రామ్‌ ఇజమా?
అవును. మనకు చాలా ఇజాలు తెలుసు. ఫిలాసఫీతో ఐడియాలజీని కలిపి సమాజం కోసం చేసే ప్రయత్నమే ఈ ఇజం సినిమా. ఏ ఇజం అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. దానికి ఏ పేరు పెట్టినా మీ ఇష్టమే.
 
ప్రధానంగా చిత్రంలో చర్చించే అంశమేమిటి?
సందేశం వుంటుంది. అలా అని మీరందరూ అది చేయకండి. ఇది చేయకండి.. అనే నీతులు మాత్రం వుండవు. నేను జర్నలిస్టుగా నటించాను. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు పాత్ర. ఇందులో నేను చేసిన పాయింట్‌ చూస్తే.. అవును కదా! ఇలానే వుంటే ఎలా వుంటుందనే! ఫీలింగ్‌ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఇలా చేస్తే.. సమాజంలో చాలా మార్పు వస్తుందనిపిస్తుంది కూడా.
 
'వికీలీక్స్‌' వంటి అంశాన్ని చర్చించారని తెలిసింది?
కరెక్ట్‌గా చెప్పాలంటే. దానికంటే ముందే కథను పూరీగారు చెప్పారు. బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ కూడా అప్పుడే చేశారు. ఆ తర్వాత వికీలీక్స్‌ బయటకు వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే చాలా విషయాలు ఇందులో కన్పిస్తాయి.
 
పూరీ జగన్నాథ్‌తో కష్టమనిపించలేదా?
మొదటి మూడు రోజులు ఇబ్బంది పడ్డాను. సింక్‌ కాలేదు. తర్వాత తర్వాత ఆయనతో ప్రయాణం ఎన్నో విషయాలను నేర్పింది. ఆయన నాకిచ్చే స్పూర్తి అద్భుతం. ఫ్రెండ్‌లా మారిపోతారు. నేను చేసిన ఇప్పటి దర్శకులతో ది బెస్ట్‌ పూరీ అని చెప్పగలను.
 
పూరీ సినిమా అంటేనే డైలాగ్స్‌, హీరోయిజం రాష్‌గా వుంటాయి. మరి ఇందులో?
ఇప్పటివరకు పూరీ సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. అలాగే ఇజంకు ముందు కళ్యాణ్‌ వేరు. ఈ సినిమా తర్వాత వేరు అనేలా వుంటుంది. మా ఇద్దరికీ కొత్తగా చూస్తారు.
 
జర్నలిస్టుకు సిక్స్‌ప్యాక్‌ అవసరమా?
కథ చెప్పినప్పుడే పాత్ర కోసం సన్నబడాలని పూరీగారు చెప్పారు. దాని కోసం 4 నెలలు మారి చూపిస్తా అన్నాను. జర్నలిస్టు పాత్ర అయినా.. మనిషి షార్ప్‌గా, దృఢంగా సమస్యలు ఎదుర్కోవాలంటే ఆరోగ్యం కూడా వుండాలి. దానికోసం సిక్స్‌ ప్యాక్‌ చేశాం.
 
ఇంతకుముందు పూరీకి పెద్దగా విజయాలు లేవు. మరి ఆలోచన వచ్చిందా?
ఎవరికైనా అపజయాలు సాధారణమే. ఈ సినిమ ఆడుతుంది. ఇది ఆడదు. అని ఖచ్చితమైన నిర్ణయానికి ఎవ్వరూ రాలేరు. మనం నమ్మి దానిపైనే ముందుకు సాగాలి.
 
అలా నమ్మి ఎంతవరకైనా వెళతారని విన్నాం. అటు బడ్జెట్‌ పరంగానూ.. ఇబ్బందులు కలగవా?
కొన్నిసార్లు తప్పవు. సినిమాను నమ్మి తీస్తే కొద్దిగా ఖర్చు పెరుగుతుంది. సిద్ధమై ముందుకు సాగాలి. కొన్నిసార్లు ఇబ్బందులు పడ్డాను. కానీ నన్ను నేను నమ్మినప్పుడు చేయాలి. అలా అని ఓవర్‌ బడ్జెట్‌ ఎప్పుడూ పెట్టలేదు.
 
హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యత వుందా?
ఆదిత్య ఆర్య కథానాయికగా నటించింది. ఏవో నాలుగు పాటలు, గ్లామర్‌ అని కాకుండా.. ఆమెకూ ప్రాధాన్యత వుంటుంది.
 
ఎన్‌టిఆర్‌తో సినిమా అన్నారు. ఎంతవరకు వచ్చింది?
రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయాలని అనుకున్నాం. కానీ కుదరలేదు.
 
ఎన్‌టిఆర్‌తో మీ కథ విషయం చర్చిస్తారా?
తప్పకుండా. మేము ఒకరి సినిమా గురించి చర్చించుకుంటాం. అన్నదమ్ములుగా చాలా హ్యాపీగా అనుభూతులు పంచుకుంటాం. 
 
సాయిధరమ్‌తో సినిమా అన్నారు.. ఎప్పుడు?
ఇంకా చర్చల దశలో వున్నాయి. ఫైనల్‌ కాగానే నేనే ప్రకటిస్తాను. దానితో పాటు మరో సినిమా చేస్తాను. ఆ వివరాలు త్వరలో చెబుతాను అని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైన‌ర్ బాలిక‌పై లైంగిక దాడి- గర్భం దాల్చింది.. ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్లు జైలు

పిన్నాపురంలో పవన్ పర్యటన.. హెలికాప్టర్‌ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ పరిశీలన (video)

ఘనంగా ఘట్కేసర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 6 వార్షికోత్సవం: ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments