మొరాకోలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''

Webdunia
బుధవారం, 25 మే 2016 (10:40 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ''గౌతమీపుత్ర శాతకర్ణి''. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితకథను ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా మొరాకోలో జరిగింది. మొరాకోలోని అట్లాస్ స్టూడియోస్‌లో వరు జార్జియస్‌లో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించారు. రామ్ - లక్ష్మణ్ నేతృత్వంలో బాలకృష్ణ , కబీర్ బేడీలతో పోరాట సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. దాదాపు 1000 మందితో భారీ సన్నివేశాలను పూర్తి చేశారు. 
 
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంతవరకూ మొరాకోలో హాలీవుడ్ సినిమా షూటింగులు మాత్రమే జరుగుతూ వచ్చాయి. ఈ చిత్రం తాజాగా మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభంకానుంది. అయితే ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలు మాత్రమే మొరాకోలో షూటింగ్ జరుపుకోగా, తొలిసారి ఓ ఇండియన్ చిత్రం, అదీ మన తెలుగు చిత్రం మొరాకోలో రెండు వారాల పాటు షూటింగ్ జరుపుకోవడం విశేషం. ఈ సినిమా షూటింగులో రెండు వందల గుర్రాలను.. రెండు వందల ఒంటెలను ఉపయోగించడం ఇంకో విశేషం. ఇంకా ఈ చిత్రం విడుదలై ఇంకెన్నిరికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రా అరుణాచల... కోటప్పకొండ గిరిప్రదక్షణ మార్గం నమూనా లేఅవుట్ పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

సిట్‌ విచారణ సీరియల్‌ లా మారింది... : కేటీఆర్

తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు, ఎక్కడెక్కడ ఆగుతుంది?

ఈడీ ముందుకు విజయసాయి రెడ్డి : జగన్ వెన్నులో వణుకు .. మంత్రి పయ్యావుల

దీపక్ ఆత్మహత్య: వ్యూస్ కోసం కావాలనే అలా చేసిందా? మహిళ షిమ్జితా అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments