Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నా... దిల్ రాజు ఇంటర్వ్యూ

ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ టాప్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా, వ‌రుస బ్లాక్‌బ‌స్టర్స్ క‌థ‌ల‌తో సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్‌ల‌తో దూస

Webdunia
శనివారం, 25 జూన్ 2016 (19:18 IST)
ఓ వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ టాప్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగా, వ‌రుస బ్లాక్‌బ‌స్టర్స్ క‌థ‌ల‌తో సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్న ద‌ర్శ‌కుడు మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించ‌గా, మారుతి టాకీస్ బ్యాన‌ర్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పైన రూపొందిన చిత్రం ‘రోజులు మారాయి’. ముర‌ళీక‌ష్ణ ముడిదాని ద‌ర్శక‌త్వంలో జి.శ్రీనివాస‌రావు నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందింది. సినిమా జూలై 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా  దిల్‌రాజుతో ఇంట‌ర్వ్యూ...
 
అసోసియేన్‌కు కార‌ణం ఏమిటి...?
మారుతి ఓరోజు వ‌చ్చి `రోజులు మారాయి`సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పి నన్ను అసోసియేట్ కావాల‌ని అడిగాడు. మారుతి సినిమాలు చేసే విధానం, లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమాలు తీసే ప‌ద్ధ‌తి నాకు న‌చ్చ‌డంతో నేను కూడా స‌రేన‌ని ఒప్పుకున్నాను. క‌థ చెప్పిన త‌ర్వాత స్క్రిప్ట్‌తో స‌హా రెడీ చేసి నాకు పంపించారు. నేను చ‌దివి ఒకే అన‌డంతో మా జ‌ర్నీ స్టార్ట‌య్యింది. 
 
కాన్సెప్ట్ ఏంటి?
'రోజులు మారాయి`లో చేత‌న్‌, కృతిక ఒక జంట అయితే పార్వ‌తీశం, తేజ‌స్వి మ‌రో జంట‌గా క‌న‌ప‌డ‌తారు. సోష‌ల్‌ మీడియా వ‌ల్ల యువ‌తలో ఎలాంటి మార్పు వ‌చ్చింద‌నే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు అబ్బాయిల‌ పైనే ఈ కాన్సెప్ట్ మూవీస్ వ‌చ్చాయి కానీ అబ్బాయిల స్థానంలో ఇద్ద‌రు అమ్మాయిల‌ను తీసుకుని చివ‌ర్లో వారు త‌మ త‌ప్పునెలా తెలుసుకున్నారనే కాన్సెప్ట్‌తో చేసిన సినిమా. 
 
మీ నిర్మాణంలో చేయ‌క‌పోవ‌డానికి కారణం...
సాధార‌ణంగా దిల్‌రాజు బ్యాన‌ర్‌లో సినిమా అంటే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ అనే ముద్ర ప్రేక్ష‌కుల మ‌న‌సులో ప‌డిపోయింది. అలాగ‌ని ఈ సినిమా గురించి త‌ప్పు చెబుతున్నాన‌ని కాదు, నా బ్రాండ్ సినిమాలు ఇలాంటి కావ‌ని ఆడియెన్స్ అభిప్రాయం. బిజినెస్ యాంగిల్‌లో చేసిన సినిమా. అందుక‌ని ఈ సినిమాను మేమే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నాం. 
 
వేరే బ్యాన‌ర్స్‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్నారే...
ఒక‌ప్పుడు ఓ సినిమాకు సంబంధించిన వ‌ర్క్ అంతా నేనే చూసుకునేవాడిని కానీ ఇప్పుడు శిరీష్‌, హ‌ర్షిత్ ఇలా టీం పెరిగింది. దాంతో మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాల‌తో జాయింట్ వెంచ‌ర్స్ చేస్తున్నాం. ఇప్పుడు టాలీవుడ్‌లో కాన్సెప్ట్ సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఇలా కాన్సెప్ట్ సినిమాలను ఎంక‌రేజ్ చేయ‌డం వ‌ల్ల చిన్న సినిమాల సంఖ్య పెరుగుతూ వ‌స్తుంది. 
 
సినిమా ఎలా వచ్చింది..
సినిమా ఫ‌స్టాఫ్ చూశాను. గంట ప‌దిహేను నిమిషాలు చాలా స‌ర‌దాగా ఉంటుంది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే అది కూడా గంట ప‌దిహ‌ను నిమిషాలుంటే నేను స‌ల‌హాలు చెప్పి దాని వ్య‌వ‌ధి 55 నిమిషాలు చేశాను. 
 
మారుతి గురించి మీ కామెంట్...?
భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమా త‌ర్వాత వెంక‌టేష్‌గారితో బాబు బంగారం చేసి నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్లిపోయాడు. దాంతో త‌న ద‌గ్గ‌ర ఉన్న మంచి క‌థ‌లకు స్క్రిప్ట్ రాసి ముర‌ళీకృష్ణ వంటి కొత్త ద‌ర్శ‌కుల‌ను ఎంక‌రేజ్ చేస్తున్నాడు. 
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా ప్రయత్నం ఎంతవరకు వచ్చింది...?
త్రివిక్ర‌మ్ ఏ హీరోతో చేస్తాడో తెలియ‌డం లేదు. ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. అయితే ఈ సినిమాను ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌తో చేయ‌డానికి నా వంతుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాను. అయితే అదెంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.
 
ఏడాదికి ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నారు...
ఏడాదికి ఇన్నే సినిమాలు చేయాల‌ని టార్గెట్ ఏమీ లేదు. మంచి క‌థ‌లు వ‌స్తే చేసుకుంటూ పోవ‌డ‌మే త‌ప్ప ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేయాల‌నేం ఆలోచ‌న లేదు. 
 
త‌దుప‌రి చిత్రాలు...
నాని సినిమాను ఆగ‌స్టులో స్టార్ట్ చేసి డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తాం. శ‌ర్వానంద్ హీరోగా శ‌త‌మానం భ‌వతి సినిమాను సంక్రాంతికి అంటే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. సినిమా ప్రారంభం రోజునే విడుద‌ల తేదిని కూడా ప్ర‌క‌టించేస్తాం అని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments