కుమారి 21 ఎఫ్ సూపర్ అన్నారు జూనియర్ ఎన్టీఆర్ : దేవీశ్రీప్రసాద్‌ ఇంటర్వ్యూ

Webdunia
సోమవారం, 23 నవంబరు 2015 (21:20 IST)
సంగీత దర్శకుల్లో చురుగ్గా సాగిపోతున్న దేవీశ్రీప్రసాద్‌.. డిఎస్‌పిగా సుపరిచితుడు. ఆయన బాణీలు యూత్‌ను అలరిస్తాయి. సాహిత్య కుటుంబం నుంచి వచ్చిన ఈయన మాత్రం సంగీతంలో రాణించారు. ఎక్కువగా చిరంజీవి కాంపౌండ్‌ దర్శకుడిగా పేరున్న దేవీశ్రీ... ఇతర హీరోలకు చేశాడు. అయితే అవి అంత ఎఫెక్ట్‌వ్‌గా లేవంటూ విమర్శలు వస్తుండేవి. అందులో ఎటువంటి పక్షపాతం వుండదనీ, ఇదో ప్రచారం మాత్రమే అని కొట్టిపారేస్తున్న ఆయన తాజాగా 'కుమారి 21ఎఫ్‌' చిత్రానికి పనిచేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి యూత్‌ ఆదరణ వుందని ఆయన అంటున్నారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ.. 
 
చిన్న సినిమాకు పనిచేయడానికి కారణం?
చిన్నాపెద్దా అనే తేడాలేదు. పని అంతా ఒకేలా వుంటుంది. ఎక్కువగా నాకు అగ్రహీరోల చిత్రాలకే అవకాశాలు రావడంతో అలా ముద్రపడి వుంటుంది. 
 
ఈ సినిమా కథ విన్నాక ఏమనిపించింది?
హీరోయిన్‌.. నిర్మొహమాటం లేకుండా... చాలా బోల్డ్‌గా అన్ని విషయాలు మాట్లాడటం. కొత్తగా అనిపించింది. ఇలాంటి పాత్రలు ఈ జనరేషన్‌లో ఎక్కువగా వున్నారు. అయితే వారు తమ కెరీర్‌లో ఒక క్లారిటీతో మాట్లాడతారు. అది మగాళ్ళలో లోపిస్తుంది. కథంతా విన్నాక... కొత్త పాయింట్‌ అనిపించింది. అయితే ముగింపు ఎలా వుండాలనేది చాలా చర్చ చేశారు సుకుమార్‌గారు. అయితే ఈ చిత్రంలో ఇచ్చిన ముగింపు.. నచ్చితే.. సినిమా ఎక్కడికో వెళుతుంది. ఏమాత్రం అటూఇటూ అయిందా.. గోవిందా.. ఆ భయంతో సుకుమార్‌కు చెప్పాను. దానికి ఆయన మాత్రం ధైర్యంగా వున్నారు. ఎందుకంటే యువత ఇప్పుడు ఎదుర్కొనే సమస్యలు ఇందులో వున్నాయి. ఆయన క్లారిటీ చూసి నేనూ ఆశ్చర్యపోయాను.
 
సినిమా విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?
ఇష్టంతో చేసిన ఒక పనికి ఇంతటి రెస్పాన్స్‌ రావడం చూస్తే, చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అయితే.. ఒక సినిమా హిట్‌ అయితే, ఓకే సినిమా హిట్‌ అయ్యింది, హ్యాపీస్‌ అనుకుంటాం. ఈ సినిమా విషయంలో మా నమ్మకం హిట్‌ అయ్యింది అనే ఫీలింగ్‌ కలిగింది. అందుకు ఇంకా హ్యాపీ!
 
ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన చ్చింది?
ముందుగా అభినందించింది ఎన్టీఆర్‌. ఆయనే మొదట ఈ సినిమా చూశారు. సినిమా చూశాక ఆయనిచ్చిన రెస్పాన్స్‌ చూశాక ఎక్కడిలేని ఉత్సాహం వచ్చింది. ఇక రిలీజ్‌ తర్వాత మహేష్‌ గారు, రవితేజ గారు, బన్నీ ఇలా అందరూ నాకు పర్సనల్‌గా ఫోన్‌ చేసి మరీ అభినందించారు.
 
ఈ సినిమాలో మిమ్మల్ని నటించమని ఎవ్వరూ అడగలేదా?
ఇందులో అడగలేదుకానీ.. కానీ.. '100%లవ్‌'లో అడిగారు. కానీ దానికి అమాయకమైన అబ్బాయి సరిపోతాడు. అందుకే నేను చేయనని చెప్పాను. ఇక ఆ తర్వాత చాలా చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. ఎక్కువగా తమిళ్‌లో ఆఫర్లు వస్తున్నాయి. అల్లు అరవింద్‌, దిల్‌ రాజు అయితే.. గేట్లు నీ కోసం ఎప్పుడూ తెరిచే వుంటాయన్నారు. హాలీవుడ్‌తో సంగీత దర్శకులు నటులుగా చాలామంది మారారు. అలాగే నాకూ వుంది. నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథ కుదరాలి.
 
ఓవర్‌సీస్‌లో డిఎస్‌పి అంటూ కేరింతలు కొడతారంటగదా?
అవును.. అక్కడ సంగీత కార్యక్రమాల్లో.. ఆడియన్స్‌ ఇన్‌వాల్వ్‌ అవుతారు. ప్రతి నిముషాన్ని ఎంజాయ్‌ చేస్తారు. అక్కడ షోలు ఇవ్వాలంటే ఇంట్రెస్ట్‌ కలుగుతంది. 70 ఏళ్ళ వారు కూడా బాగా ఎంజాయ్‌ చేసి అభినందిస్తారు. మన దగ్గర అలాంటి కల్చర్‌ ఇంకా రాలేదు.
 
'కుమారి..' సినిమాలో మీకు బాగా నచ్చిన అంశం?
సుకుమార్‌ రాసిన కథే. ఆయన ఆర్య చిత్రానికి పనిచేసినప్పుడే ఆయన ఆలోచనలు డిఫరెంట్‌గా వుంటాయని గ్రహించాను. ఈ కథ వినగానే ఆయనెంత కొత్తగా ఆలోచిస్తారో మరోసారి స్పష్టమైంది. ఇలాంటి ఒక బోల్డ్‌ కథ తెలుగులో రావడం, ఈ కాన్సెప్ట్‌‌ను ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా మంచి కథతో చెప్పడం నన్ను బాగా ఎగ్జైట్‌ చేశాయి. ఇప్పుడీ సినిమా పాటల విషయంలో, బ్యాక్‌గ్రౌండ్‌ విషయంలో నాకు ఈ స్థాయి కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయంటే ఆ క్రెడిట్‌ సుక్కుకే వెళుతుంది.
 
ఓ పాటకు మీరే డాన్స్‌మాస్ట్‌ర్‌గా చేశారని చెప్పారు?
అవును..  అనుకోకుండా జరిగిపోయింది. ఈ ట్యూన్‌ డిజైన్‌ చేసినప్పుడే కొన్ని మూమెంట్స్‌ కూడా చెప్పా. సుకుమార్‌, రత్నవేలులకు అది నచ్చి పూర్తి కొరియోగ్రఫీ చేయించేశారు. బ్యాంకాక్‌ నేపథ్యాన్ని కొత్తగా పరిచయం చేయడం అనే పాయింట్‌‌లో ఈ పాట బాగా సక్సెస్‌ అయింది.
 
కొత్త దర్శకుడు ఎలా చేశాడు...
సూర్య ప్రతాప్‌తో సుకుమార్‌ ద్వారానే కరెంట్‌ సినిమా అప్పుడు పరిచయం అయింది. ఆ సినిమా కూడా ప్రేమకథల్లో ఓ కొత్త కోణాన్ని చూపించింది. ఇక ఈ సినిమాలో అయితే అతడి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశాలను అంత పకడ్బందీగా, ఎమోషన్‌ మిస్సవకుండా చేయడం మామూలు విషయం కాదు. ఈ విషయంలో ఆయన్ను అభినందించాలి.
 
చిన్నసినిమాలకు సంగీతంలో తేడా వుంటుందా?
ఏ సినిమా అయినా ఒక్కటే. నిజం చెప్పాలంటే చిన్న సినిమాల్లో నేనిచ్చిన కొన్ని పాటలు పెద్ద సినిమాల కంటే కూడా పాపులర్‌ అయినవి ఉన్నాయి. ఒక సినిమా చేస్తున్నామంటే అది నచ్చితేనే చేస్తాం. అప్పుడిక చిన్న, పెద్ద అని తేడా చూసే అవకాశమే లేదు.
 
పవన్‌.. ఎన్‌టిఆర్‌.. చిత్రాలు ఎలా వుండబోతున్నాయి?
ఈ రెండు సినిమాల ఆల్బమ్స్‌ కూడా అంచనాలను అందుకుంటాయన్న నమ్మకం ఉంది. నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్‌ కెరీర్‌కి మరో బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. ఇక సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ పాటల విషయంలో పవన్‌ గారు చాలా ఎగ్జైట్‌ అయ్యారు. ఆయన ఒక మెలోడీ విని ఓ పెద్ద మెసేజ్‌ పెట్టారు. ఈ రెండు సినిమాల కోసం నేనూ అందర్లానే ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
 
సంగీతంలో అంతా కాపీనే అనే ప్రచారం జరుగుతోంది. దీనిపై మీరెలా స్పందిస్తారు?
నా కెరీర్లో ఇప్పటివరకూ కాపీ కొట్టలేదు. చెప్పాలంటే.. ఒక దర్శకుడు ఒక వెస్ట్రన్‌ ట్యూన్‌ వినిపించి, కాపీ కొట్టమంటే నో అనేశా. మనం సంగీతం నేర్చుకొని కాపీ కొడుతున్నామంటే అసలు చేస్తున్న పనికి అర్థమే లేదు. ఎక్కడైనా ఒక స్వరం కలిస్తే చెప్పలేం కానీ, తెలిసి మాత్రం నేనెప్పుడూ వేరే ట్యూన్‌ తీసుకోలేదు. ఒకరి ట్యూన్‌ కాపీ కొట్టడమంటే అది పెద్ద నేరం కిందే లెక్క
 
మీ పెళ్లెప్పుడు?
ఇంకా ఆ సమయం రాలేదు. ఇంకా ఎవ్వరినీ ప్రేమించలేదు. గతంలో ఏవో పుకార్లు వచ్చాయి. ఇంతకంటే ఏం చెప్పలేను.. అంటూ ముగించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

Show comments