Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్ ఫ్రెండ్‌ ద్వారా మారుతిని కలిశా... అపుడే ధైర్యం వచ్చింది : చేతన్ మద్దినేని

నాకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే చాలా ఆస‌క్తి. ఇంజ‌నీరింగ్ త‌ర్వాత నాన్న‌గారిని క‌లిసి సినిమాల్లోకి వెళ్లాల‌నుంద‌ని చెప్ప‌గానే ఆయ‌నెంతో ఎంక‌రేజ్ చేశారు. అలాగే డైరెక్ట‌ర్ మారుతి ప్ర‌తి విష‌యంలో ఎంతో

Webdunia
సోమవారం, 4 జులై 2016 (15:32 IST)
నాకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే చాలా ఆస‌క్తి. ఇంజ‌నీరింగ్ త‌ర్వాత నాన్న‌గారిని క‌లిసి సినిమాల్లోకి వెళ్లాల‌నుంద‌ని చెప్ప‌గానే ఆయ‌నెంతో ఎంక‌రేజ్ చేశారు. అలాగే డైరెక్ట‌ర్ మారుతి ప్ర‌తి విష‌యంలో ఎంతో కేర్ తీసుకున్నార‌ని అంటున్నాడు యంగ్ హీరో చేత‌న్ మ‌ద్దినేని. మారుతి టాకీస్ బ్యాన‌ర్‌పై శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'రోజులు మారాయి'. ముర‌ళీక‌ష్ణ ముడిదాని ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీనివాస‌రావు నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందింది. సినిమా జూలై 1న విడుద‌లైంది. రెండురోజుల్లో రూ.2 కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో చేత‌న్ మ‌ద్దినేనితో ఇంట‌ర్వ్యూ...
 
* నేప‌థ్యం... 
మాది విశాఖ‌ప‌ట్నం. నాన్న‌గారు ప‌దిహేనేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. అయినా నా చ‌దువంతా ఇక్క‌డే సాగింది. ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను. 
 
* నాకు సినిమా అంటే పిచ్చి... 
ఒక్కొక్క‌రికీ ఒక్కో పిచ్చి ఉంటుంది. అలా నాకు చిన్న‌ప్ప‌ట్నుంచి సినిమాలంటే చాలా ఆస‌క్తి. నేను చిన్న‌ప్పుడు టీవీ ఎక్కువ‌గా చూసేవాడిన‌ని అనేవారు. నాన్న‌గారు కూడా న‌న్ను చిన్న‌ప్పుడు సినిమాల్లో న‌టింప చేయాల‌నుకున్నారు. కానీ కుద‌ర‌లేదు. 
 
* నాన్న‌గారు ఎంక‌రేజ్ చేశారు... 
సినిమాకు సంబంధించి ఏదైనా చేయాల‌నుంద‌ని నా ఇంజ‌నీరింగ్ పూర్త‌యిన వెంట‌నే నాన్న‌ను క‌లిసి చెప్పేశాను. నాన్న‌కు కూడా సినిమాలంటే ఆస‌క్తి ఉండ‌టంతో ఆయ‌న న‌న్ను హీరో అయితే బావుంటుంద‌ని సూచించారు. 
 
* మారుతిగారితో ప‌రిచ‌యం... 
సినిమాల్లోకి రావాల‌నుకోగానే వైజాగ్ స‌త్యానంద్ మాస్ట‌ర్‌గారి ద‌గ్గ‌ర యాక్టింగ్‌లో శిక్ష‌ణ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు నాన్న అమెరికాలో ఉండ‌టంతో ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా మారుతిగారిని క‌లిశాం. ఆయ‌న న‌న్ను చిన్న‌పాటి ఆడిష‌న్ చేసి రెండు, మూడు సంవ‌త్స‌రాలు మీ అబ్బాయిని నా ద‌గ్గ‌ర వ‌దిలేయండి సార్.. మీకొక మంచి హీరోనిస్తాను అన్నారు. ఆ మాట‌తో నాన్న‌కు ధైర్యం వ‌చ్చింది. 
 
* బాగా క‌ష్ట‌ప‌డ్డాను.. 
నటుడిగా 'రోజుల మారాయి' తొలి సినిమా కావ‌డంతో బాగా క‌ష్ట‌ప‌డ్డాను. స్క్రిప్ట్ విష‌యం మిన‌హా ముఖ్యమైన విష‌యాల్లో త‌ప్ప మిగ‌తా వాటిలో ఇన్‌వాల్వ్ అయ్యాను. ముందుగానే స్క్రిప్ట్ తీసుకుని బాగా ప్రిపేర్ అయ్యేవాడిని. రిలీజ్ త‌ర్వాత తొలి సినిమా అయినా బాగా చేశాన‌ని అంద‌రూ అన‌డం హ్యాపీగా ఉంది. మా సినిమా రెండు రోజుల్లోనే రెండు కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను సాధించడం ఇంకా ఆనందంగా ఉంది. పార్వ‌తీశం, కృతిక‌, తేజ‌స్వి అందరూ బాగా స‌పోర్ట్ చేశారు. అలాగే మారుతిగారు ప్ర‌తి విష‌యంలోనూ ఎంతో కేర్ తీసుకున్నారు. 
 
* నెక్ట్స్ ప్రాజెక్ట్‌.. 
ఓ సినిమాలో న‌టిస్తున్నాను. ఇప్ప‌టికే 70 శాతం పూర్త‌య్యింది కానీ ఆ వివ‌రాల‌ను నేనిప్పుడే చెప్ప‌లేను.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments