డి. సురేష్ బాబు నా కథను రెండేళ్లుగా పెట్టుకున్నారు... ఏం చేస్తాం...? : చంద్రశేఖర్‌ ఏలేటి ఇంటర్వ్యూ

తొలి సినిమానే 'ఐతే' వంటి భిన్నమైన కాన్సెప్ట్‌తో వెలుగులోకి వచ్చిన దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి. ఆ తర్వాత సినీరంగాన్ని ఏలేద్దామని అనుకున్నా.. కొన్ని సినిమాలకు బ్రేక్‌ పడ్డాయని చలోక్తి విసిరారు. సినిమా సినిమాకు చాలా గ్యాప్‌ వస్తుందనీ, అయినా ఈలోగా కథల్ని

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (21:36 IST)
తొలి సినిమానే 'ఐతే' వంటి భిన్నమైన కాన్సెప్ట్‌తో వెలుగులోకి వచ్చిన దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి. ఆ తర్వాత సినీరంగాన్ని ఏలేద్దామని అనుకున్నా.. కొన్ని సినిమాలకు బ్రేక్‌ పడ్డాయని చలోక్తి విసిరారు. సినిమా సినిమాకు చాలా గ్యాప్‌ వస్తుందనీ, అయినా ఈలోగా కథల్ని రాసుకుంటాననీ.. గోపీచంద్‌ 'సాహసం' తర్వాత ఓ కథను ప్రముఖ నిర్మాతకు చెబితే రెండేళ్ళపాటు ఆ కథను తనవద్దే వుంచుకున్నారనీ... లేదంటే ఈ పాటికి సినిమా తీసేవాడినని అంటున్న ఆయన తాజాగా 'మనమంతా' తీశారు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఏలేటితో ఇంటర్వ్యూ విశేషాలు.
 
'మనమంతా' అంటే ఏమిటి?
పేరులోనే.. మనం.. మనందరం కలిస్తేనే. మనమంతా.. అని అర్థం. అంటే.. పిల్లాడి నుంచి పెద్దాడి వరకు.. మన కథే.. అన్నంతగా వుంటుంది. అందుకే ఆ టైటిల్‌ పెట్టాం. దైనందిన జీవితంలో జరిగే సంఘటనలు, పోరాటాలే ఈ సినిమాలో వుంటాయి.
 
'ఐతే' టు 'సాహసం'వరకు భిన్నమైన కథల్ని తీసుకుని ఈసారి ఫ్యామిలీ కథను తీసుకోవడానికి కారణం?
కుటుంబ విలువలతో కూడిన సినిమాను చేయాలనిపించింది. అందుకు తగిన సమయం ఇదని చేశాను.
 
మోహన్‌లాల్‌ను ఎంచుకోవడానికి కారణం?
ప్రత్యేకత ఏమీలేదు. కథే ఎంపిక చేసేలా చేసింది.
 
ఇలాంటి కథలకు వెంకటేష్‌ వున్నారు కదా?
కరెక్టే. ఫ్యామిలీ సినిమాలంటే వెంకటేష్‌ గుర్తుకువస్తాడు. కానీ మా కథ ప్రకారం.. ఇమేజ్‌ లేని హీరో కావాలి. అందువల్ల కొత్తవారైతే బాగుంటుందని మోహన్‌లాల్‌ను అనుకోవడం మొదట్లోనే జరిగింది. పైగా.. మలయాళంలో కూడా సినిమాను విడుదల చేసే మార్గం కూడా దొరికింది.
 
అసలు కథేమిటి?
ఇది నలుగురుపై సాగే కథ. స్కూల్‌కెళ్ళే పాప, కాలేజీ చదివే కుర్రాడు, గృహిణి, మధ్యతరగతి మనిషి పాత్రలే కీలకం. ఈ నలుగురివి నాలుగు నేపథ్యాలు. వీరంతా ఫైనల్‌గా ఒకచోట ముగింపు వుంటుంది. అదే సినిమా.
 
4 కథలు చెప్పడం గొప్ప ప్రయోగమేనా?
ప్రయోగం అనను కానీ.. నా కెరీర్‌లో మోస్ట్‌ డిఫరెంట్‌ మూవీ ఇది. ఈ నాలుగు కథలు తీస్తుంటే.. నాలుగు సినిమాలు తీసిన ఫీలింగ్‌ కల్గింది. నలుగురు కథలు ఒక్కచోట కలపాలి. అది సమంజసంగా అనిపించాలి..
 
అవార్డు కోసం ట్రై చేస్తున్నారా?
ఆ ఆలోచనే రాదు. సినిమా చేసేటప్పుడు ఈ సినిమా బాగా తీయాలి. ఆడుద్దా! లేదా! అనే విషయాలో మైండ్‌లో వుంటాయి కానీ అవార్డును దృష్టిలో పెట్టుకుని సినిమా తీయలేం. తీస్తే ముందుగా ప్రిపేర్‌ అవ్వాలి.
 
'సాహసం' తర్వాత గ్యాప్‌ వచ్చిందే?
గ్యాప్‌ అనేది దైవాదీనం. వరుసగా సినిమాలు చేయాలనుంటుంది. రెండు కథలు ఇద్దరు నిర్మాతల దగ్గర వున్నాయి. రెండేళ్ళ పాటు సురేష్‌ బాబు దగ్గర ఓ కథ వుంది. అది జరిగితే వెంటనే సినిమా వచ్చేది. ఇలాంటి కొన్ని డిస్టబెన్స్‌ వస్తుంటాయి. ఏదైనా మన ఫేట్‌పైనే ఆధారపడి వుంటుంది.
 
మోహన్‌లాల్‌తో పనిచేయడం ఎలా వుంది?
ఆయనతో పనిచేయడం ఏదో నేర్చుకున్నట్లుంది. నేనేగనుక మలయాళం నేర్చుకుని మాట్లాడాలంటే కాదని చెబుతాను. కానీ ఆయన తెలుగును పట్టుదలతో నేర్చుకుని.. డబ్బింగ్‌ కూడా చెప్పారు. ఆయన డెడికేషన్‌కు ఆశ్చర్యపోయాను. చిన్నచిన్న విషయాలను కూడా వదిలేవారు కాదు. చేయిని షాట్‌గా తీయాలంటే.. వేరే వారి చేయిపెట్టి మాయ చేయవచ్చు. కానీ.. నా చేతినే తీయండని..అవసరమైతే వస్తానని చెప్పేవారు. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన క్లారిటీతో వున్నారు.
 
'ఐతే' వంటి కాన్సెప్ట్‌ మళ్ళీ ఆశించవచ్చా?
చేయలేం. ఎందుకంటే.. అప్పట్లో ఆ సినిమా అర్థం కాలేదన్నారు. అంటే ప్రేక్షకులకు చేరవేయలేకపోయాను. ఇప్పుడయితే ప్రేక్షకులు బాగా అర్థంచేసుకోగలరు. కానీ అలాంటి కాన్సెప్ట్ వచ్చేసింది.
 
గత సినిమాలకు ఇప్పటి సినిమాలకు తేడా ఏమి గ్రహించారు?
గతంలో సినిమాలు చేయాలంటే ఈజీగా వుండేది. అందుకే ఎక్కువ సినిమాలు వచ్చేవి. అప్పట్లో డైలాగ్‌ బేస్డ్‌ మూవీలు. హీరోతోపాటు అందరూ డైలాగ్‌ చెప్పేవారు. కానీ రానురాను పరిస్థితులు మారాయి. విజువాలిటీకి ప్రాధాన్యత పెరిగింది. డైలాగ్‌తో చెప్పేది విజువల్‌గా చూపించాలి. హాలీవుడ్‌ సినిమాల ఎఫెక్ట్‌ చాలా వుంది.
 
తదుపరి చిత్రం?
ఈ సినిమా విడుదలయ్యాక.. రిజల్ట్‌ను బట్టి ప్రకటిస్తాను అని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్‌బోర్డ్‌లతో పురుషుల ప్రయాణం (video)

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?

ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..

ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

తర్వాతి కథనం
Show comments