2003లో నేను మొత్తం 18 సినిమాలకు సంగీతం అందించగా.. వాటిలో 13 చిత్రాలు విడుదలై సంగీత దర్శకుడిగా నా పేరు మారుమ్రోగేలా చేశాయి. ఆ 13 చిత్రాలు వరుసగా...
1. తొలి చూపులోనే, 2. అమ్మాయిలు- అబ్బాయిలు, 3. వీడే, 4. దొంగరాముడు అండ్ పార్టీ, 5. నేను సీతామహాలక్ష్మి, 6. ఆంధ్రావాలా, 7. శివమణి (98480 22338), 8. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా, 9. అందరూ దొంగలే (దొరికితే), 10. నేను పెళ్ళికి రెడీ, 11. 143, 12. పెదబాబు, 13. సోగ్గాడు!
ఇప్పటివరకు నేను చేసిన 99 సినిమాల్లో 'టాప్-10' నన్ను సెలక్ట్ చేయమని అడగడమంటే.. కచ్చితంగా కావాలని నన్ను ఇబ్బంది పెట్టడమే. కానీ 'చెప్పి తీరాల్సిందే'నని మీరు 'పెన్ను పట్టుకుని' గట్టిగా అడుగుతున్నారు కాబట్టి.. (పెద్దగా నవ్వుతూ) వరుసగా ఈ సినిమాల పేర్లు చెబుతాను.
5. అమ్మానాన్న ఓ తమిళమ్మాయి దర్శకుడు: పూరి జగన్నాథ్
6. దేశముదురు దర్శకుడు: పూరి జగన్నాథ్
7. దేవదాస్ దర్శకుడు: వైవిఎస్ చౌదరి
8. నేనింతే దర్శకుడు: పూరి జగన్నాథ్
9. కృష్ణ దర్శకుడు: వి.వి.వినాయక్
10. సింహా దర్శకుడు: బోయపాటి శ్రీను శ్రీ
ఇప్పటి వరకు నేను స్వరపరిచిన సుమారు 500 పాటల నుంచి.. 'టాప్-10' సాంగ్స్ సెలక్ట్ చేయడం మరింత కష్టమైన పని. అయితే చెప్పమని పట్టుబడుతున్నారు కాబట్టి దిగువ పాటల్ని పేర్కొంటున్నాను. నా పర్సనల్ టేస్ట్‌ను బట్టి కాకుండా.. ప్రేక్షకాదరణ పొందడాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ లిస్ట్ చెబుతున్నాను.