Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజన ప్రియులమే.. అమ్మాయికి వంట రాకున్నా ఫర్వాలేదు: బాహుబలి ప్రభాస్

భారతీయ చలనచిత్ర చరిత్రలో అనితర సాధ్యమైన దృశ్య అద్భుతంగా పేరొందిన బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ బయటపడినట్లే. కానీ ఆ హ్యాంగోవర్ ఇంకా తనను వదలడం లేదు. ఇకపై అసాధారణంగా బాడీని పెంచడం, తగ్గించడం వంటి పనులకు కొంత కాలం దూరం అంటున్నాడు.

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (04:34 IST)
భారతీయ చలనచిత్ర చరిత్రలో అనితర సాధ్యమైన  దృశ్య అద్భుతంగా పేరొందిన బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ బయటపడినట్లే. కానీ ఆ హ్యాంగోవర్ ఇంకా తనను వదలడం లేదు. ఇకపై అసాధారణంగా బాడీని పెంచడం, తగ్గించడం వంటి పనులకు కొంత కాలం దూరం అంటున్నాడు. నాలుగేళ్లకు పైగా అంకితభావంతో బాహుబలి కోసం పనిచేస్తూ జనాలకు కనబడనందుకు సారీ చెబుతున్నానని,ఇకపై మీకు మొహం మెత్తేటన్ని సార్లు కనబడుతూనే ఉంటానని ప్రబాస్ అబిమానులకు హామీ ఇచ్చాడు.


సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు వేగంగా పూర్తి చేస్తానని, మంచికథ దొరికితే బాలీవుడ్‌లో సినిమా చూస్తాను తప్ప హాలీవుడ్ జోలికి వెళ్లనని ప్రభాసం చెబుతున్నాడు. తన పెళ్లి ఎంగేజ్‌మెంట్ గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని, టైమ్ వచ్చనప్పుడే పెళ్లి జరుగుతుందని చెబుతున్న ప్రబాస్ కుటుంబమంతా భోజన ప్రియులమే అయినా తన కాభోయే భార్యకు వంట రాకపోయినా ఫర్వాలేదు, రెస్టారెంట్లున్నాయి కదా అని లైట్ తీసుకుంటున్నాడు. నాలుగేళ్ల విరామం తర్వాత బాహుబలితో సంబంధం లేని తొలి ఇంటర్వ్యూను ప్రముఖ తెలుగు ఛానల్‌కి ఇచ్చిన ప్రభాస్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. 
 
‘బాహుబలి’ లాంటి భారీ సినిమా చేసిన తర్వాత ఏ సినిమా అయినా మీకు చాలా ఈజీగా ఉంటుందేమో
కొంచెం ఈజీయే. ‘బాహుబలి’కి చిన్నపాటి ప్రెజర్‌ ఉండేది. గెటప్, యాక్టింగ్‌... అసలు సినిమా కాన్సెప్టే వేరు. అందుకని టెన్షన్‌గా ఉండేది. ఇప్పుడు కొంచెం కూల్‌గా చేయొచ్చు. అయితే సినిమా మొత్తం కూల్‌గా చేసినా రిలీజ్‌ టైమ్‌లో టెన్షన్‌ తప్పదు. ప్రతి సినిమా విడుదల ముందు నాకు పిచ్చ టెన్షన్‌గా ఉంటుంది.
 
రాజమౌళి లాంటి మహా యోగితో సినిమా చేశాక సుజిత్‌ లాంటి బాల మేధావితో సినిమా చేయడం...
రాజమౌళి వేరు. సుజిత్‌ వేరు. రాజమౌళిని గురువులా భావిస్తా. ఆయన్నుంచి ప్రొఫెషనల్‌గానే కాదు.. పర్సనల్‌గా కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. సుజిత్‌కి 26 ఏళ్లు. కుర్రాడు కాబట్టి థాట్స్‌ ఫ్రెష్‌గా ఉంటాయి. పైగా నేను ఇంత యంగ్‌ డైరెక్టర్‌తో ఇప్పటివరకూ సినిమా చేయలేదు. అందుకని చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది.
 
ఇంతకీ మీరు భోజనప్రియులేనా వచ్చే అమ్మాయికి వంట బాగా తెలిసుండాలా
మా ఇంటిల్లిపాదీ... పెదనాన్నగారు, నేను... మొత్తం అందరం భోజనప్రియులమే. అస్సలు మొహమాటపడకుండా బ్రహ్మాండంగా తింటాం. కానీ, వచ్చే అమ్మాయికి వంట తెలియకపోయినా ఫర్వాలేదు. ఇవాళ బోల్డన్ని రెస్టారెంట్లు ఉన్నాయి కదా... అక్కడికి వెళ్లడమే.
 
మార్చి, ఏప్రిల్‌లో ‘బాహుబలి’ ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌తో బిజీగా ఉంటాం. సుజిత్‌తో చేయబోయే సినిమా ఏప్రిల్‌లో స్టార్ట్‌ అవుతుంది. మాంచి ఎండలు. అయినా నేను ఒకటి ఫిక్స్‌ అయ్యా. సమ్మర్‌ అయినా వింటర్‌ అయినా ఆగేది లేదు. సినిమాలు చేసేయడమే. ఒకేసారి రెండు సినిమాలు చేయాలని ఫిక్స్‌ అయ్యాను. ఒకటి సుజిత్‌ సినిమా, ఇంకోటి రాధాకృష్ణ సినిమా.
 
‘బాహుబలి’ కోసం నాలుగేళ్లు డెడికేట్‌ అయిపోవడం మీ ఫ్యాన్స్‌ని బాధపెట్టింది... అది మీరు గ్రహించారా
అందుకే అప్పుడప్పుడూ ‘సారీ’ చెబుతున్నాను. ఫ్యాన్స్‌ ఎక్కువ సినిమాల్లో చూడాలని కోరుకుంటారు. కానీ, ‘బాహుబలి’లాంటి సినిమా చేసేటప్పుడు వేరే సినిమా సాధ్యం కాదు. ఇప్పుడు ఏడాదికి రెండు సినిమాలు చేయాలన్నది ప్లాన్‌. ఇది చదివి ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతారనుకుంటున్నా.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments