కుటుంబాల్లేవు.. కుటుంబ కథల్లేవు.. ఇక వేషాలెక్కడివి...: అన్నపూర్ణమ్మ ఇంటర్వ్యూ

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2015 (21:10 IST)
బ్లాక్‌ అండ్‌ సినిమాల నుంచి సహాయనటిగా, నటిగా, అమ్మగా పలు పాత్రలు పోషించిన నిర్మలమ్మ తర్వాత గుర్తుకు వచ్చేది అన్నపూర్ణమ్మ. మూడు దశాబ్దాలకుపైగా 700 పైగా సినిమాల్లో నటించారామె. మూడు దశాబ్దాల పాటు ప్రతి ఒక్క హీరోకు తల్లిగానో, అత్తగానో ఆమే కనిపిస్తారు. బంగారు గనిలాంటి ఆనాటి సినీ పరిశ్రమని, పబ్లిసిటీనే ముఖ్యమనుకునే ఈనాటి పరిస్థితులనీ చూసి అర్థం చేసుకుని వీటి మధ్య పోలిక సరికాదనే సహృదయం ఆమెది. ఆమె పుట్టిన రోజు ఈ నెల 23. అంటే ఆదివారం. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
 
ఈ నటనా కెరీర్‌ ఎలా జరిగింది? 
పుట్టి పెరిగింది విజయవాడ. నాన్న ఆర్టీసీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మేం నలుగురం తోబుట్టువులం. ముగ్గురు అక్కాచెల్లెళ్ళం, ఒక తమ్ముడు. నా అసలు పేరు ఉమామహేశ్వరి. చిన్నప్పటి నుండి చదువు ఒంటబట్టలేదు. వీధి చివర వేసే నాటకాలంటే చాలా ఇష్టం. వాటిని చూస్తూ అక్కడే పడుకునేదాన్ని. 1966లో ఒక రోజు నాగయ్య అని మా దూరపు చుట్టం వచ్చి నాటకంలో చిన్నపిల్ల పాత్ర వేయించడానికి నన్ను తీసుకెళ్తానని మా అమ్మని అడిగాడు. అమ్మ ఒప్పుకుంది.
 
సుమారుగా 40 రిహార్సల్స్‌ వేసిన తర్వాత 1967 జనవరిలో బోయి భీమన్నగారి 'పాలేరు' నాటకాన్ని ప్రదర్శించాం. అందులో 'బాల' అనే చిన్నపిల్ల వేషం వేశాను. అది చూసి అమ్మానాన్నా బాగా చేశావని మెచ్చుకున్నారు. ఆ నాటకానికి పారితోషికంగా 25 రూపాయలు ఇచ్చారు. అలా నాటకాల ప్రస్థానం మొదలైంది. 
 
సినిమా ప్రవేశం? 
'అమ్మాయిలూ జాగ్రత్త' సినిమా నిర్మాత నన్ను మద్రాసుకు పిలిపించి మేకప్‌ టెస్ట్‌ చేశారు. కానీ బాగాలేదని వద్దన్నారు. ఆ నిర్మాతే నన్ను బయట చూసి, 'బయట ఆ అమ్మాయి బాగానే ఉంది కదా' అని మళ్ళీ ఆ సినిమాకు తీసుకున్నారు. అందులో ప్రభ, సుజాత, నేను అక్కాచెల్లెళ్ళుగా నటించాం. ఆ సినిమా చేస్తుండగానే దాసరి నారాయణరావుగారు 'స్వర్గం - నరకం' సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. అప్పుడే నా పేరు అన్నపూర్ణగా మార్చారు. ఆ సినిమా బాగా ఆడినా, నాకెందుకో హీరోయిన్‌గా నేను బాగా లేననిపించింది. అందుకే 'నాకు అమ్మ, అక్క, వదిన పాత్రలుంటే చెప్పండి, చేస్తాను' అని చెప్పాను.  
 
అప్పటి నటుల మధ్య వాతావరణ ఎలా వుండేది?
అప్పట్లో మనం కూడా వాళ్ళ కంటే బాగా పనిచేసి పేరు తెచ్చుకోవాలనే తపనుండేది. డైలాగులు మొత్తం బైహార్ట్‌ చేసి చెప్పేవాళ్ళం. హీరోలు కూడా అనుకున్న టైమ్‌కి వచ్చేవాళ్ళు. సమయపాలన ఉండేది. సిన్సియర్‌గా వర్క్‌ చేసేవాళ్లు. డిసిప్లిన్‌గా, సిస్టమేటిక్‌గా ఉండేది. ఒక పాత్రకు ఎవరు సరిగ్గా సరిపోతారు, న్యాయం చేస్తారు అనుకుంటారో, వాళ్ళనే ఎంపిక చేసుకునేవాళ్ళు. పెద్దాచిన్నా అనే మర్యాద ఉండేది. ఒక కుటుంబంలో తాత, ముత్తాతలకు ఎలా గౌరవం ఇస్తామో ఇండస్ట్రీలో కూడా అలాగే ఉండేది.
 
ఇప్పటి నటులు ఎలా వున్నారు?
ఇప్పుడు యాక్టింగ్‌ కంటే కాకానే ఎక్కుగా కనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఆర్టిస్టులని బుక్‌ చేయడమే ఒక రోజు ముందు బుక్‌ చేస్తున్నారు. మన సీను మాత్రమే లొకేషన్‌కి వెళ్ళబోయే ముందు చెప్తారు. పక్కన ప్రామ్టింగ్‌ చెప్తున్నారు కాబట్టి డైలాగులు చెప్పటం కూడా ఈజీ అయిపోయింది. అందుకని అప్పటికి ఇప్పటికి అనేదాన్ని పోల్చొద్దు.   
 
దీనికి కారణమేటని భావిస్తారు?
ఈ తరం వాళ్ళని కూడా తప్పుపట్టలేం. ఎందుకంటే టైమింగ్‌ అలా ఉంది. వేషాన్ని వెతుక్కుంటూ వచ్చి డబ్బు సంపాదించిన వాళ్ళు అప్పటి హీరోలు. ఇప్పుడు డబ్బులో మునిగి తేలి, యాక్ట్‌ చేస్తున్న పిల్లలు వీళ్ళు. అందుకని వీళ్ళు అప్పట్లా అన్ని విలువలు పాటించాల్సిన అవసరం నాకేం కనపడటంలా. ఈ జనరేషన్‌ ఒళ్ళు రాకుండా, పొట్ట రాకుండా ఎక్సర్‌ సైజులు చేస్తూ, సరిగా తినకుండా కష్టపడుతున్నామని ఫీలవుతున్నారు. నీరసంతో వాళ్ళు ఎక్కువసేపు పని చేయలేకపోతున్నారు. ఇప్పుడోళ్ళకి డబ్బు లేని కష్టం తెలీదు.   
 
నటనకు గ్యాప్‌ ఇచ్చేరే?
నటనకి ఎక్కువ గ్యాప్‌ రావడమే మర్చిపోలేని సంఘటన. ఏదైనా పనిలో బిజీగా ఉన్నామంటే ఇంకేం గుర్తుండదు. గ్యాప్‌ రావడానికి కారణం.. మాబోటివారికి పాత్రలు లేకపోవడమే.. అప్పట్లో కుటుంబకథా చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు కుటుంబాలు లేవు. కథలు లేవు. ఏదో చిన్న వేషం వున్నా అప్పటికప్పుడు పిలిస్తే వెళ్ళడం మినహా.. ఇంకా ఏదో చేయాలని తపన లేదు. వున్నా చేసే అవకాశమూ లేదు.
 
మీరు సారీ చెప్పిన సందార్భలున్నాయా?
నేను పొరపాటు చేయనని నా అభిప్రాయం. పొరపాటు ఉంటే నేనే ముందు సారీ చెప్పేస్తాను. నా పొరపాటు లేకుండా ఎవరైనా అవమానంగా మాట్లాడితే మాత్రం భరించలేను. కొన్ని విషయాల్లో సరిపెట్టుకుని పర్వాలేదండీ... అని నవ్వి ఊరుకోలేను. నాలో ఉన్న లోపం అదే అనుకుంటున్నాను. అది కూడా ఈ వయసుకు ఓర్చుకోవాలి. కానీ అదింకా అలవాటు కాలేదు. ఆ మెంటాలిటీకే కొన్ని అవకాశాలు పోయుండొచ్చు.
 
భగవంతుడు ఆయుషు ఇచ్చినంతకాలం, జనాలు నన్ను యాక్సెప్ట్‌ చేసినంతకాలం ఇలా మీకు కనిపిస్తూనే ఉంటాను. ఆశావాదిని. ఫ్యూచర్‌ బాగుంటదనుకునే మెంటాలిటీ నాది. నేననే కాదు, ఈ జనరేషన్‌ పిల్లలకి కూడా చెప్పేదేంటంటే... రేపటిని నమ్మాలి. నిన్నటిని తలచుకోకూడదు. ఈ రోజుని ఎంజాయ్‌ చేయాలి అని ముగించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

National Girl Child Day 2026: బాలికల కోసం సంక్షేమ పథకాలు.. అవేంటో తెలుసా?

హోం వర్క్ చేయలేదని నాలుగేళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి

స్మైలీ ఆకారంలో చంద్రుడు, శని, నెప్ట్యూన్.. ఆకాశంలో అద్భుతం

మహిళా మసాజ్ థెరపిస్ట్‌పై దాడి చేసిన మహిళ.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

Show comments