ఎస్‌.వి.రంగారావు అంటే చాలా ఇష్టం... అడివి శేష్

''సినిమా రంగంలో నాకిష్టమైన నటుడు ఎస్‌.వి. రంగారావు. ఆయన ఏ పాత్రలో అయిన నటించగలడు. నేను హీరో, విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అని చూడను. పాత్రకు న్యాయం చేయగలిగే ఎటువంటి పాత్రలోనైనా నటిస్తాను. 'క్షణం' సినిమా తరువాత హీరోగా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. న

Webdunia
శనివారం, 19 మార్చి 2016 (20:26 IST)
''సినిమా రంగంలో నాకిష్టమైన నటుడు ఎస్‌.వి. రంగారావు. ఆయన ఏ పాత్రలో అయిన నటించగలడు. నేను హీరో, విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అని చూడను. పాత్రకు న్యాయం చేయగలిగే ఎటువంటి పాత్రలోనైనా నటిస్తాను. 'క్షణం' సినిమా తరువాత హీరోగా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. నా వరకు నేను హీరో, విలన్‌ అని ఫిక్స్‌ అవ్వలేదని'' నటుడు, దర్శకుడు అడివి శేష్‌ తెలియజేస్తున్నాడు. 'కర్మ' సినిమాతో దర్శకునిగా, హీరోగా తెలుగు తెరకు పరిచయమయిన వ్యక్తి. ఆ తరువాత 'పంజా', 'రన్‌ రాజా రన్‌', 'బాహుబలి' చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా 'క్షణం' సినిమాలో నటించారు. విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.
 
క్షణం సక్సెస్ పైన ఎలా ఫీలవుతున్నారు..?
'క్షణం' సినిమా విడుదలయ్యి నాలుగు వారాలయ్యింది. ఇప్పటికీ థియేటర్లు ఇంకా పెరిగాయి. చాలా సంతోషంగా వుంది. నిజానికి మొదట జీరో బడ్జెట్‌లో ఇంగ్లీష్‌లో సినిమా చేసి కాన్‌ ఫిలిం ఫెస్టివల్‌కి పంపించాలనుకున్నాం. కాని పివిపి గారికి కథ నచ్చడంతో మాకు ధైర్యం వచ్చింది. తక్కువ బడ్జెట్‌లో సినిమా చేసి సక్సెస్‌ సాధించాం. సినిమా ఆడిన ఈ నాలుగు వారాలు నా జీవితంలో మర్చిపోలేని రోజులు.
 
దర్శకుడిగా తొలిసారి ఫెయిల్యూర్ చూశారు కదా...
'కర్మ' సినిమా తరువాత దర్శకునిగా 'కిస్‌' చేశాను. అది అపజయాన్ని చూపింది. కాని అందులో ఒక విలువైన పాయింట్‌ చెప్పాను. అందరికి సినిమాలో కొన్ని కొన్ని సీన్లు నచ్చాయి కాని ఓవరాల్‌గా సినిమా నచ్చలేదు. ఆ సినిమా తరువాత నేను కొంచెం గ్యాప్‌ తీసుకొని నా ఐడియాలను డెవలప్‌ చేసుకున్నాను. ఆ సమయంలో నా మనసుకు నచ్చింది మాత్రమే చేయాలని ఫిక్స్‌ అయ్యాను. అలా చేస్తేనే మంచి రిజల్ట్‌ వస్తుంది. అలా నేను చేసిన 'రన్‌ రాజా రన్‌', 'లేడీస్‌ అండ్‌ జెంటిల్మెన్‌', 'బాహుబలి', 'దొంగాట' ఇలా ప్రతి సినిమా మంచి విజయాన్ని అందించింది. ఏ ఒక్క నిర్మాతా నష్టపోలేదు.
 
దర్శకత్వమా.. నటనా... దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు..?
ఈ సినిమాకు నేను, రవికాంత్‌ కలిసి స్క్రీన్‌ ప్లే రాసుకున్నాం. అయితే అబ్బూరి రవి మా కథను, స్క్రీన్‌ ప్లేను పాజిటివ్‌గా తీసుకొచ్చారు. జెన్యూన్‌ టీం వర్క్‌గా చేశాం. అయితే 'క్షణం' సినిమాకు దర్శకత్వం చేయాలని నేను అనుకోలేదు. నేను నటించే సినిమాను నేను డైరెక్ట్‌ చేయను. రెండు పనులు ఒకేసారి చేయలేను. ఏదైనా ఒక్కటే చేస్తాను. బహుశా ముందుముందు నా నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ప్రస్తుతం అయితే నటించడమో, డైరెక్ట్‌ చేయడమో ఏదో ఒక్కటి మాత్రమే చేస్తాను.
 
హిందీలో రీమేక్‌ చేస్తున్నట్లు విన్నాం...
ఈ సినిమా బాలీవుడ్‌ రీమేక్‌ రైట్స్‌ సాజిత్‌ ఫ్యాన్సీ రేట్‌కు కొన్నారు. పెద్ద ప్లాట్‌ ఫాంలో సినిమా చేస్తున్నారని విన్నాను.
 
కాపీ సినిమా అని విమర్శలు వచ్చాయి కదా..
నా శ్రేయోభిలాషులు, స్నేహితులు కొంతమంది సినిమాను కాపీ చేసారని బయట మాట్లాడుకుంటున్నారని చెప్పారు. కొన్ని సినిమా సీన్లను యాడ్‌ సినిమా చేశామనే గాసిప్స్‌ వినిపించాయి. మేము ఏ సినిమాను కాపీ చేయలేదు. ఇది ఒరిజినల్‌ స్క్రిప్ట్‌.
 
'ఊపిరి'లో అతిథి పాత్ర చేస్తున్నారా..
 
'ఊపిరి' సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాను. వంశీ గారు నటించమని అడిగేసరికి కాదనలేకపోయాను. నా పార్ట్‌ పారిస్‌లో షూట్‌ చేశారు.
 
తదుపరి చిత్రాలు
బాలీవుడ్‌లో నటించమని అడుగుతున్నారు. అలానే తెలుగులో కూడా కొన్ని అవకాశాలు వచ్చాయి కాని ఇంకా ఏది సైన్‌ చేయలేదని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళలో బస్సులో లైంగిక వేధింపులు.. వ్యక్తి ఆత్మహత్య.. కార్డ్‌బోర్డ్‌లతో పురుషుల ప్రయాణం (video)

ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు.. జనసేనకు, బీజేపీకి ఎన్ని స్థానాలు?

ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు

తొమ్మిది తులాల బంగారు గొలుసు... అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వృద్ధురాలి వద్ద దోచుకున్నారు..

ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. మహిళల లోదుస్తులను దొంగిలించిన టెక్కీ.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి పాటించాలి

మొలకెత్తిన విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

క్యాన్సర్ అవగాహనకు మద్దతుగా 2026 ముంబయి మారథాన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్

Show comments