Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాది లవ్ మ్యారేజే: జెనీలియా

Webdunia
FILE
" సత్యం" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన చిలిపి నవ్వుల ముద్దుగుమ్మ జెనీలియా డిసౌజా. ఆగస్టు ఐదోతేదీ, 1987లో పుట్టిన జెనీలియా.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.

బాలీవుడ్ గ్రాండ్ ఫాదర్ అమితాబ్ బచ్చన్‌తో పార్కర్ పెన్ వ్యాపార ప్రకటన చిత్రం (యాడ్ ఫిలిమ్) ద్వారా వెలుగులోకి వచ్చిన జెన్నీ.. హిందీలో "తుజే మేరి కసం"తో తెరంగేట్రం చేసింది.

ఇలా ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన జెనీలియా తాజాగా తెలుగులో "సత్య ఇన్ లవ్" అనే చిత్రంలో నటిస్తోంది. సాంబ, సై, హ్యాపీ, రామ్, ఢీ వంటి చిత్రాల్లో నటించిన జెనీలియాకు "బొమ్మరిల్లు" చిత్రం మొదటి ఫిలిం ఫేర్ అవార్డును (ఉత్తమ నటి అవార్డు) సంపాదించిపెట్టింది. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్‌లలో బిజీబిజీగా ఉన్న జెన్నీని కదిలిస్తే ఇలా చెప్పుకొచ్చింది.

ప్రశ్న: "సత్య ఇన్ లవ్"లో మీది ఎలాంటి పాత్ర?
జ: వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పుడే ఆ పాత్ర గురించి చెప్పను.

ప్రశ్న: మీది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా?
జ.. తప్పకుండా నాది లవ్ మ్యారేజే.

ప్రశ్న: మీకు భర్తగా వచ్చే వ్యక్తి ఎలా ఉండాలి?
జ: సామాన్యంగా మగాడంటే ఆడదాన్ని గౌరవించే మనస్తత్వం కలిగి ఉండాలి. అదే నేను కోరుకుంటా. ఇద్దరిలోనూ ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం ఉండాలి. నేను చెప్పే విషయాన్ని చెవొగ్గి వినడం చేయాలి.

అలాకాకుండా అధికారం చెలాయించకూడదు. ప్రేమతో మెలిగే వ్యక్తికే నేను ఫుల్ మార్కులు వేస్తానంటూ మినీ ఇంటర్వ్యూ ఇచ్చి సీన్ టేక్ వచ్చేసిందంటూ వెళ్లిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments