Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాక్స్‌పై జుకర్ బర్గ్ సంచలన ప్రమాణం: సేవా కార్యక్రమాలకే 99 శాతం ఆస్తులు!

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2015 (08:45 IST)
ఫేస్ బుక్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకెర్ బర్గ్ వారం క్రితం జన్మించిన తమ కూతురుకు మ్యాక్స్‌గా నామకరణం చేసుకున్నారు. అంతేగాకుండా మ్యాక్స్‌పై సంచలన ప్రమాణం చేశారు. తమ ఆస్తిలోని 99 శాతాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తామని బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సక్రమ రీతిలో ఖర్చు చేసేందుకు ‘చాన్ జుకెర్ బర్గ్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఈ యువ దంపతులు ప్రకటించారు. పుట్టబోయే కూతురు కోసం జుకెర్ బర్గ్ ఏకంగా రెండు నెలల పితృత్వ సెలవు తీసుకున్న సంగతి తెలిసిందే.
 
కాగా సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ది తొలి విజయమన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఒకే వేదికపైకి చేర్చిన ఫేస్ బుక్‌తో దాని సహ వ్యవస్థాపకుడు, సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకెర్ బర్గ్ అత్యంత పిన్న వయసులోనే బిలియనీర్‌గా అవతరించాడు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసున్న జుకెర్ బర్గ్, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్‌ల ఉమ్మడి ఆస్తి 45 బిలియన్ డాలర్లకు పైగా ఉండటం గమనార్హం. కాగా ఇటీవలే ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments