Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాగ్లైడింగ్ చేస్తూ 85 అడుగులు ఎత్తునుంచి పడి యూట్యూబర్!!

ఠాగూర్
బుధవారం, 1 మే 2024 (08:47 IST)
ఓ యూట్యూబర్ పారాగ్లైడింగ్ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. 85 అడుగుల ఎత్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదకర ఘటన అమెరికాలోని టెక్సాస్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రపంచంలో ఉన్న సాహస క్రీడా పోటీల్లో అత్యంత ప్రమాదకరమైన సాహస క్రీడాపోటీల్లో పారాగ్లైడింగ్ ఒకటి. అమెరికాకు చెందిన ఆంథోని వెల్లా అనే యూట్యూబర్ పారాగ్లైడింగ్ చేస్తూ 85 ఎత్తు నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల రాక్ స్టేట్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. బాధితుడి మెడ, తుంటె, వీపు భాగాల్లోని పలు ఎముకలు విరిగిపోవడంతో శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది.
 
ఆంథోని వెల్లా ప్రమాదం తాలూకు దృశ్యాలు అతడి కెమెరాకు చిక్కాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అతడు ఓ మోటారు సాయంతో పారాగ్లైడింగ్ చేశారు. దీన్ని పారామోటరింగ్ అంటారు. అయితే, ఆంథోని సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండగా అదుపుకోల్పోయాడు. పారామోటార్‌న్ను అదుపు చేయలేక చివరకు కిందపడ్డాడు. చెకింగ్ సందర్భంగా ఓ చిన్న లోపం గుర్తించలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అతడు వివరించాడు.
 
దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ అతడు తీవ్రగాయాల పాలై ఆక్రందనలు చేశాడు. ఈ క్రమంలో అటువైపు నుంచి వెళుతున్న కొందరు ఆంథోనీని గుర్తించి, అత్యవసర సిబ్బంది అతడి భార్యకు సమాచారం అందించారు. ప్రస్తుతం తన భర్త కోలుకుంటున్నాడని ఆంథోని భార్య సోషల్ మీడియాలో చెప్పింది. అతడిని కాపాడిన వారికి, వైద్యులకు ధన్యవాదాలు తెలిపింది. చేతులు, వీపునకు కొన్ని ఆపరేషన్లు జరిగాయని, మరికొన్ని శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి ఉందని ఆమె తెలిపింది. మరికొన్ని వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని కూడా చెప్పింది. కాగా, ఆంథొని చికిత్సకు నిధుల సేకరణ కోసం గోఫండ్మీ పేజీ కూడా ఏర్పాటుచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments