Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టి దుస్తులు వేసుకునేవాళ్లంతా తప్పక చచ్చిపోవాల్సిందే: పంచ్‌ల మీద పంచ్‌లిచ్చి..?

ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండాలనేది నేటితరం యువత ఆలోచన. అందుకే దుస్తుల విషయంలో తోటివారి కంటే భిన్నంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది నేటి యూత్. అదే క్రమంలో మార్కెట్లోకి పోటెత్తుతున్న ఫ్యాషన్‌

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (12:14 IST)
ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉండాలనేది నేటితరం యువత ఆలోచన. అందుకే దుస్తుల విషయంలో తోటివారి కంటే భిన్నంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది నేటి యూత్. అదే క్రమంలో మార్కెట్లోకి పోటెత్తుతున్న ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ బ్రాండెడ్ ఫ్యాషన్స్‌కు ఐకాన్‌గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఫ్యాషన్ ఏమాత్రం ఎబ్బెట్టుగా మారినా.. నలుగురిలో నవ్వుల పాలు గాక తప్పడు... దెబ్బలు పడకా తప్పదు. 
 
పొట్టి దుస్తులు వేసుకొని వచ్చిందని బస్సులో కూర్చున్న ఓ యువతిపై ఓ యువకుడు దాడి చేశాడు. పిడిగుద్దులు కురిపించి కాళ్లతో తన్నాడు. ఈ వింత ఘటన ఇస్తాంబుల్లో జరిగింది. 'పొట్టి దుస్తులు వేసుకునేవాళ్లంతా తప్పక చచ్చిపోవాల్సిందే' అని గట్టిగా అరుస్తూ ఆగ్రహంతో ఊగిపోతూ ఆ యువతి ముఖంపై చేతితో పంచ్లమీద పంచ్లు ఇచ్చి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసుల రంగ ప్రవేశం చేసి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ''ఆ మహిళ బట్టలు వేసుకునే విధానం చూసి తనకు కోపం వచ్చిందని, ఆమె దుస్తులు సరైన విధంగా లేవని పోలీసులకు తెలిపాడు. అందుకే తాను ఆగ్రహానికి లోనై అలా ప్రవర్తించానని వివరించాడు. ఈ దాడికి పాల్పడిన ఆ యువకుడు ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డులా పనిచేస్తున్నాడు. టర్కీలో మహిళలపై ఇలాంటి దాడులు జరగడం ఇటీవల సర్వసాధారణంగా మారాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments