Webdunia - Bharat's app for daily news and videos

Install App

గగనంలో ప్రసవించిన మహిళ - బిడ్డకు స్కై అని పేరుపెట్టిన తండ్రి

Webdunia
ఆదివారం, 22 మే 2022 (10:23 IST)
అమెరికాలో ఫ్లోరిడాలో గగనంలో వెళుతున్న విమానంలో ఓ మహిళ పండండి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ బిడ్డకు స్కై అని పేరు పెట్టారు. ఈ సంఘటన అమెరికాలోని డెన్వర్ నుంచి ఒర్లాండో వెళుతున్న విమానంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డెన్వర్ నుంచి ఒర్లాండోకు ఓ విమానం బయలుదేరింది. ఇది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నిండుగర్భంతో షకేరియా మార్టిన్ అనే ప్రయాణికురాలికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో విమాన సిబ్బందిలో ఒకరైన డయానా గిరాల్డో తక్షణం స్పందించి ఆ మహిళను బాత్రూంలోకి తీసుకెళ్లగా, అక్కడ ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
విమానంలో పుట్టిన ఆ పాపకు కుటుంబ సభ్యులు ‘స్కై’ అని నామకరణం చేయడం విశేషం. షకేరియా సుఖ ప్రసవానికి సహకరించిన డయానును ప్రయాణికులు, విమానయాన సంస్థ అధికారులు ప్రశంసించారు. 
 
మరోవైపు, విమానం గాల్లో ఉండగా జన్మించిన ఆ శిశువుకు కుటుంబ సభ్యులు ‘స్కై’గా నామకరణం చేశారు. ఒర్లాండో విమానాశ్రయ సిబ్బందికి విషయం తెలియజేయడంతో విమానం ల్యాండ్ కాగానే షకేరియా, ఆమె బిడ్డను ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments