Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ఊరికి వెళ్లడం ఇష్టంలేని భార్య.. ఏం చేసిందో తెలుసా?

ఆడవాళ్ళు అనుకుంటే కొండలనైనా పిండి చేయగలరు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. తన భర్త ఊరికి వెళ్లొద్దని అనుకున్న ఒక భార్య ఏకంగా విమానాశ్రయానికి ఫోన్ చేసి బాంబు ఉందంటూ తన భ

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (11:45 IST)
ఆడవాళ్ళు అనుకుంటే కొండలనైనా పిండి చేయగలరు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. తన భర్త ఊరికి వెళ్లొద్దని అనుకున్న ఒక భార్య ఏకంగా విమానాశ్రయానికి ఫోన్ చేసి బాంబు ఉందంటూ తన భర్త వెళ్లాల్సిన విమానాన్ని రద్దుచేసి తనేంటో నిరూపించింది. ఈ వింత ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. 
 
ఆ వివరాల్లోకి వెళ్తే.. అన్నెసీ అనే మహిళ తన భర్త విదేశాలకు పనిమీద వెళుతుంటే వద్దని వారించింది. అయినా ఆమె భర్త ఆ మాటల్ని పట్టించుకోకుండా ప్రయాణానికి సిద్ధమైయ్యాడు. తన భర్త ప్రయాణాన్ని రద్దు చేయాలని భావించిన మహిళ ఒక పథకాన్ని ఆలోచించింది. వెంటనే విమానాశ్రయానికి ఫోన్ చేసి బాంబు ఉందంటూ బెదిరించింది. 
 
జెనీవాలోని కాయిన్‌ ట్రిన్‌ ఎయిర్‌ పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో అధికారులు విమానాశ్రయం మొత్తం ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. మొత్తం వెతికినా బాంబు దొరక పోవడంతో ఫోన్‌ కాల్‌ ఎక్కడ నుండి వచ్చిందా అని ఎంక్వౌరీ మొదలుపెట్టారు. 
 
ఆ కాల్‌ ప్రాన్స్‌లోని అన్నెసీ అనే మహిళ చేసినట్లుగా నిర్థారించారు. ఆమెను అరెస్టు చేసి ప్రశ్నించగా తన భర్తపై ప్రేమతో తాను ఇలా చేశానని చెప్పింది. భర్తపై ప్రేమతో అందరిని ఇబ్బంది పెట్టినందుకు ఆమెపై పోలీసులు కేసును నమోదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments