'చిల్లార్‌'ను చిల్లరగా పోల్చుతూ శశిథరూర్ చిల్లర ట్వీట్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 17 యేళ్ళ తర్వాత విశ్వసుందరిగా అవతరించిన మానస చిల్లర్‌ను చిల్లరతో పోల్చుతూ ట్వీట్ చేశారు. ఇది వివాదాస్పదమైంది.

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (09:45 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 17 యేళ్ళ తర్వాత విశ్వసుందరిగా అవతరించిన మానస చిల్లర్‌ను చిల్లరతో పోల్చుతూ ట్వీట్ చేశారు. ఇది వివాదాస్పదమైంది. దీనిపై నెటిజన్లు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తంచేసింది. 
 
శశిథరూర్ తన ట్వీట్‌లో ఏమని పేర్కొన్నారంటే.. "పెద్ద నోట్లను రద్దుచేసి ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేసిందో ఇప్పటికైనా గుర్తెరిగితే మంచిది. మన ‘చిల్లర’కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని ‘చిల్లర్’ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైంది’’ అని మానుషి చిల్లార్‌ను చిల్లరగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.
 
దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన మానుషి చిల్లార్‌ను చిల్లర వ్యక్తిగా పోల్చిన శశిథరూర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. తాను చిల్లర వ్యక్తినని ఆయన మరోమారు తన వ్యాఖ్యలతో నిరూపించుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టినట్టు ఉన్నాయని కొందరు కామెంట్ చేశారు. 
 
మానుషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శశిథరూర్‌పై జాతీయ మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మానుషి విజయాన్ని తక్కువ చేసిన థరూర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయనకు సమన్లు జారీ చేయాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments