Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవంతో భార్య.. మూడు వారాలు కాపురం.. తీయడానికి నిరాకరణ.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (21:07 IST)
భర్త మృతదేహంతో ఆమె మూడు వారాలపాటు ఉండిపోయింది.  చివరకు దుర్వాసన భరించలేక బయటకు తీయడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకోవడం విశేషం. న్యూజీలాండ్‌లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
భారత సంతతికి చెందిన ఓ దంపతులు గత ఏడాది కాలంగా న్యూజిలాండ్ లో నివాసముంటున్నారు. కొన్ని వారాలుగా వాళ్లిద్దరూ ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు. దీంతో చుట్టపక్కల వారికి అనుమానం వచ్చింది. అయితే, వారం క్రితం ఆ ఇంట్లో నుంచి భార్య బయటకు రావడాన్ని ఇరుగు పొరుగు వారు గమనించారు. వారు నివాసముంటున్న ఇంటి నుంచి దుర్గంధం రావడంతో ఈ విషయమై స్థానికులు ఆమెను ప్రశ్నించగా, ఎలుక చచ్చిపోయిందని ఒకసారి, ఆహారం పాడైందని మరోసారి చెప్పింది. 
 
ఇంట్లో నుంచి దుర్వాసన బయటకు రాకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులు కూడా చల్లింది. అయినప్పటికీ అవి పని చేయలేదు. దుర్వాసన హోరెత్తిపోయింది. దీంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడటంతో అసలు విషయం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో భర్త శవం ఉండడంతో వెంటనే శవాన్ని బయటకు తీసుకువెళ్లాలని చెప్పినా ఆమె వినకపోవడంతో, ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments