Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య విడాకులు ఇవ్వలేదనీ.. తుపాకీతో ఇద్దరిని కాల్చివేసిన శాడిస్ట్ భర్త

భార్య విడాకులు ఇవ్వలేదన్న అక్కసుతో ఇద్దరు వ్యక్తులను ఓ భర్త శాడిస్ట్ భర్త కాల్చివేశాడు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన నాలీ వాంగ్ అనే మహిళ

Webdunia
బుధవారం, 10 మే 2017 (10:36 IST)
భార్య విడాకులు ఇవ్వలేదన్న అక్కసుతో ఇద్దరు వ్యక్తులను ఓ భర్త శాడిస్ట్ భర్త కాల్చివేశాడు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన నాలీ వాంగ్ అనే మహిళ ఓ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె భర్త నెంగ్మీ వాంగ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారి దాంపత్య జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. తన భార్య నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించాడు. 
 
అంతే.. ఉదయాన్నే నిద్రలేచాడు. స్నానం చేసి ఎప్పుడూలేని ముస్తాబై... భార్యను విడాకులు కావాలని అడిగాడు. ఎలాంటి కారణం చెప్పకుండా కోరడంతో ఆమె సరైన సమాధానం కూడా చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన వాంగ్... ‘చచ్చిపోవాలని ఉందా..’ అంటూ భార్యను గద్దించాడు. చనిపోవాలని లేదని బదులివ్వడంతో ఆఫీస్ వెళ్లమని భార్యతో చెప్పాడు. 
 
భార్య ఆఫీస్‌కి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత అదే డ్రెస్‌లో ఓ తుపాకీ తీసుకుని బ్యాంక్‌కి వెళ్లాడు. భార్యను కాల్చి చంపే ప్రయత్నం చేశాడు. భార్య వెనుక గేటు నుంచి తప్పించుకుని పారిపోయింది. ఆ కసి చల్లారని వాంగ్... బ్యాంకులోని ఇద్దరు ఉద్యోగులతో సహా మరో ఇద్దరి కాల్చిచంపాడు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments