Webdunia - Bharat's app for daily news and videos

Install App

జో బైడెన్ విజయంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ కీలక వ్యాఖ్య

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (15:29 IST)
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సంచలనాన్ని సృష్టిస్తున్నది. దీని తాకిడిని అరికట్టేందుకు పలు దేశాలు వ్యాక్సిన్ పైన పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ వార్షిక సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం పట్ల స్పందించారు.
 
జో బైడెన్ విజయం కరోనా మహమ్మారి అంతానికి ప్రపంచ సహకారాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ వైరస్‌ను తుదముట్టించేందుకు జోబైడెన్, కమలా హారిస్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రపంచ దేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి తెలియజెప్పిందని తెలిపారు.
 
తప్పుదారి పట్టించే జాతీయవాదం కారణంగా ఇటీవలి కాలంలో అది క్షీణించిందని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ అధనోమ్ ఈ విధమైన పరోక్ష వ్యాఖలు చేశారు. ఇదిలా ఉండగా డబ్ల్యూహెచ్ఓ నుంచి ట్రంప్ వైదొలగుతున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటామని జో బైడెన్ సంకేతాలు ఇచ్చారు. టెడ్రోస్ అధనోమ్ ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇటీవల ఆయన కలిసిన ఓ వ్యక్తికి కరోనా అని తేలడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments