Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ఆక్రమిత కాశ్మీరుపై భారత్ దాడులు శభాష్... బెలూచిస్తాన్‌లో కూడా కుమ్మేయండి... మజ్దాక్ దిల్షాద్

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో భారతదేశ సైన్యం చేపట్టిన దాడులకు మేము మద్దతు తెలుపుతున్నామని బెలూచిస్తాన్ నాయకుడు మజ్దాద్ దిల్షాన్ బలోచ్ వెల్లడించారు. బలోచిస్తాన్‌లో కూడా భారత సైన్యం ఇలా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను కుమ్మేస్తే చూడాలని ఉందని ఆయన చెప్పుకొచ్

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (14:55 IST)
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో భారతదేశ సైన్యం చేపట్టిన దాడులకు మేము మద్దతు తెలుపుతున్నామని బెలూచిస్తాన్ నాయకుడు మజ్దాద్ దిల్షాన్ బలోచ్ వెల్లడించారు. బలోచిస్తాన్‌లో కూడా భారత సైన్యం ఇలా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను కుమ్మేస్తే చూడాలని ఉందని ఆయన చెప్పుకొచ్చారు. భారత సైన్యం చేస్తున్న దాడులపై తమకు తృప్తిగా ఉందని ఆయన వెల్లడించారు.
 
యూరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలను తాము ఉపేక్షించేది లేదని ఢిల్లీలో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఆపరేష‌న్స్ (డీజీఎంవో) చీఫ్ ర‌ణ్‌బీర్ సింగ్ వెల్లడించారు. పాకిస్థాన్ టెర్రరిస్టుల నుంచి తలెత్తే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని రణ్‌బీర్ సింగ్ స్పష్టం చేశారు.
 
పాకిస్థాన్ ఆగడాలను అడ్డుకుని.. తిప్పికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాక్ మ‌రోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని తెలిపారు. పాక్ నుంచి చోటుచేసుకున్న చొర‌బాట్ల‌ను ఇప్పటివరకు 20 ప్ర‌దేశాల్లో అడ్డుకున్నామని వెల్లడించారు. 
 
బుధవారం రాత్రి కూడా ఉగ్రవాదుల చొరబాటును తిప్పికొట్టినట్లు రణ్‌బీర్ సింగ్ పేర్కొన్నారు. కాల్పుల ఉల్లంఘన విషయంలో ప్ర‌మేయం ఉన్నవారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వని రణ్‌బీర్ సింగ్ హెచ్చరించారు. స‌రిహ‌ద్దుల్లో పాక్ ప‌దే ప‌దే ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతుందని చెప్పారు. పీవోకేలో ఉగ్ర‌వాద శిబిరాల‌పై దాడులు నిర్వ‌హించినట్లు చెప్పారు. పాక్ ఆర్మీ తమతో స‌హ‌క‌రిస్తుంద‌ని ఆశించినట్లు తెలిపారు. కానీ అటువైపు నుంచి స్పందన లేదని చెప్పారు.
 
ఇకపోతే యూరీ, పూంచ్‌లలో మరణించిన ఉగ్రవాదులు వేలి ముద్రలు, డీఎన్ఏ నమూనాలను పాకిస్థాన్‌కు అందేజేశామని ఆర్మీ డీజీఎంవో రణబీర్ సింగ్ వెల్లడించారు. భారత్‌పై ఎలాంటి ఉగ్రదాడులను సహించబోచమని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని స్థావరాలపై దాడులు చేస్తామని చెప్పారు. ఉగ్రవాదులు మెట్రో నగరాలపై దాడులకు కుట్ర పన్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments