Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల పోటీల్లో విజేత.. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయింది..

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (11:25 IST)
అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. కానీ ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. వేదికపైనే స్పృహ కోల్పోయింది. ఈ ఘటన మిస్ పరాగ్వే పోటీల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం మయన్మార్‌లోని యాంగాన్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీల్లో పరాగ్వే బ్యూటీ క్లారా సోసా విజేతగా ఎంపికైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. 
 
అంతే తన పేరు వినగానే ఆనందాన్ని తట్టుకోలేక స్పృహ తప్పి స్టేజీపైనే కుప్పకూలిపోయింది. రన్నరప్ అయిన భారత భామ మీనాక్షి చౌదరి వెంటనే స్పందించి ఆమెను కదిలించింది. దీంతో కోలుకున్న సోసా తేరుకుని లేచి చేతులూపి నవ్వుతూ కన్నీళ్లు పెట్టుకుంది. 
 
అంతకుముందు జరిగిన ఇంటర్వ్యూలో సోసా మాట్లాడుతూ.. విజేతగా నిలిస్తే ప్రపంచంలో హింస, యుద్ధాలకు పుల్‌స్టాప్ పెట్టాలంటూ తొలుత ఏ దేశంలో ప్రచారం చేస్తారన్న ప్రశ్నకు సోసా స్పందిస్తూ తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తానని పేర్కొంది. 
 
ఇతర దేశాలకు అమెరికా ఓ ఉదాహరణ అని, కాబట్టి తొలుత తాను ట్రంప్‌ను కలుస్తానని వివరించింది. విజేతగా నిలిచిన అనంతరం మాట్లాడుతూ.. ఆనందం పట్టలేక స్పృహ తప్పిపోయానని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments