Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ లో పడ్డ రష్యా అధ్యక్షుడు పుతిన్...!!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (07:27 IST)
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ లవ్ లో పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే ముసి..ముసి నవ్వులు నవ్వుతూ.. ఒప్పేసుకున్నారు. అయితే ఆమె ఎవరు? ఏమిటీ? అనే విషయం మాత్రం చెప్పలేదు. ఓ విలేకరి.. ఓ మిత్రుడు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానం మేరకు పుతిన్ కు లవ్ ఫివర్ అటాక్ అయ్యిందనే చెప్పాలి. 
 
ప్రస్తుతం పుతిన్ వయసు 62 సంవత్సరాలు. పుతిన్‌ తన భార్య ల్యుదిమిలాకు 2013 జూన్‌ 7న విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆమె (55) తన భర్త సుదీర్ఘకాలం రష్యా రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ బహిరంగంగా కనిపించడం చాలా అరుదు. భార్యాభర్తలిద్దరూ విడిపోయారనే వదంతులకు ఇది కూడా ఊతమిచ్చింది. ఆయన దాదాపుగా బ్యాచులర్ జీవితాన్నే గడుపుతున్నారు. 
 
ఈ సందర్భంగా  ఓ పాత్రికేయుడు మహిళల కోసం మీకు సమయం ఉంటుందా? అని అడిగినపుడు సమయం ఉంటుందని పుతిన్‌ చెప్పారు. అయితే ఆ మహిళ ఎవరు అనేది మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా ఒలింపిక్‌ జిమ్నాస్ట్‌ అలినా కబయేవాతో ఆయన సంబంధాలు నెరపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. పుతిన్‌ యూరోపులో ఉన్న తన స్నేహితుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను ప్రేమిస్తున్నట్లు చెప్పారని ఓ పత్రిక పేర్కొంది. కానీ తాను అలినా పెళ్లి చేసుకోబోతున్నాననే విషయాన్ని మాత్రం ఆయన ఖండించారని మీడియా తెలిపింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments