Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశారు... గమ్మత్తేంటంటే... 18 యేళ్ల తర్వాత వెలికి తీశారు!

వియత్నాం వైద్యులు ఓ రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశారు. ఇక్కడ గమ్మత్తేంటంటే.. దాన్ని 18 ఏళ్ల తర్వాత గుర్తించి తొలగించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వివరాలను పరిశీలిస్తే... వియత్నాంకి చెందిన మా వాన్‌హత్‌

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (07:13 IST)
వియత్నాం వైద్యులు ఓ రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేశారు. ఇక్కడ గమ్మత్తేంటంటే.. దాన్ని 18 ఏళ్ల తర్వాత గుర్తించి తొలగించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వివరాలను పరిశీలిస్తే... వియత్నాంకి చెందిన మా వాన్‌హత్‌ అనే వ్యక్తి 1998లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు బాక్‌కాన్‌ ప్రావిన్స్‌లోని ఓ ఆస్పత్రి వైద్యులు అతని కడుపుకి శస్త్రచికిత్స చేశారు. అదేసమయంలో చూసుకోకుండా కత్తెరపెట్టి కుట్లు వేసేశారు. 
 
ఇప్పుడు వాన్‌హత్‌కి 54 ఏళ్లు. కడుపులో అంత పొడుగు కత్తెర ఉన్నా వాన్‌హత్‌ సాధారణ జీవితాన్నే గడిపాడు. ఇటీవల అతనికి తీవ్ర కడుపునొప్పి రావడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. సమస్యేంటో తెలీడానికి వైద్యులు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేశారు. అప్పుడే వాన్‌హత్‌ కడుపులో 15 సెంటీమీటర్ల పొడవున్న కత్తెర ఉన్నట్టు గుర్తించారు. 
 
వెంటనే వైద్యులు దాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స ప్రారంభించారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు కత్తెరను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం వాన్‌హత్‌ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఇక్కడ మరో గమ్మత్తేంటంటే... 1998లో వాన్‌హత్‌కు శస్త్రచికిత్స చేసిన వైద్యుడి కోసం గాలింపు జరుపుతున్నామని అధికారులు చెప్పడం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments