Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళు తట్టుకుని తూలి కిందపడిన ప్రెసిడెంట్ జో బైడెన్

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (09:31 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోమారు తూలిపడ్డారు. కాళ్లు తట్టుుకోవడంతో ఆయన కిందపడ్డారు. కొలరాడాలోని ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో గ్యాడ్యుయషన్ వేడుక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వెంటనే అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను పైకి లేపారు. ఆ వెంటనే ఆయన ఎలాంటి సాయమూ లేకుండా తన సీటు వద్దకు వెళ్లి కూర్చొన్నారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని శ్వేతసౌథం కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. 
 
కాగా, జో బైడెన్ తూలిపడిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు 90 నిమిషాలపాటు జరిగిన ఈ గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమంలో విద్యార్థులకు అమెరికా అధ్యక్షుడు హోదాలో సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. 
 
కాగా 80 యేళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడై చరిత్ర సృష్టించిన జో బైడెన్... గతంలోనూ పలుమార్లూ ఇలానే తూలిపడ్డారు. ఆయన సొంత రాష్ట్రమైన డెలావర్‌లో బైక్ రైడింగ్ చేస్తూ ఒకసారి కిందపడ్డారు. మరోమారు అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కుతూ మెట్లపై తూలిపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai pallavi : గంగమ్మను దర్శించుకున్న సాయిపల్లవి.. చెల్లెలతో బీచ్‌లో ఎంజాయ్ చేసింది.. (video)

Ramcharan, Allu arjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments