Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగి విమానం నడిపేందుకు వచ్చిన పైలట్... హడలిపోయిన ప్రయాణికులు (షాకింగ్ వీడియో)

ఓ పైలట్ తప్పతాగి విమానం నడిపేందుకు వచ్చాడు. ఆ పైలట్‌ను చూడగానే ప్రయాణికులు హడలి పోయారు. ఇండోనేషియాలో ఈ పైలట్ నిర్వాకం వెలుగు చూసింది

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (14:32 IST)
ఓ పైలట్ తప్పతాగి విమానం నడిపేందుకు వచ్చాడు. ఆ పైలట్‌ను చూడగానే ప్రయాణికులు హడలి పోయారు. ఇండోనేషియాలో ఈ పైలట్ నిర్వాకం వెలుగు చూసింది. ఈ పైలట్‌కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో‌ వైరల్‌గా మారగా.. దాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుతున్నారు. 
 
సిటీలింక్ ఎయిర్‌‌లైన్స్‌కి చెందిన కెప్టెన్ టెకాఫ్ పూర్ణ విమానాశ్రయంలోకి రాగానే ప్రయాణికులు అతడిని చూసి హడలెత్తిపోయారు. నిర్లక్ష్యంగా మాట్లాడుతుండటం, టేకాఫ్‌కి ముందు అనౌన్స్‌మెంటుతో సంబంధంలేకుండా మాట్లాడడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. పైలట్ నిర్వాకం కారణంగా జకార్తా వెళ్లాల్సిన విమానం నిలిచిపోయింది. తీరా అతగాడి వ్యవహారంపై దర్యాప్తు చేసిన అధికారులు విస్మయానికి గురయ్యారు. 
 
నిబంధనలు ఉల్లంఘించి పీకల వరకు మద్యం సేవించినట్టు గుర్తించారు. అతడు ఎయిర్‌పోర్టులోకి వస్తున్నప్పటి సీసీటీవీ ఫూటేజిలను కూడా విడుదల చేశారు. పీకలదాకా తాగి తూలుకుంటూ కస్టమ్స్ తనిఖీ దగ్గర పైలట్ చేసిన హడావిడి అంతాఇంతకాదు. బ్యాగుతో పాటు వస్తువులన్నీ కిందపడేసుకుంటుంటే.. కస్టమ్స్ సిబ్బంది వాటిని ఏరి అతడికివ్వడం.. కడుపుబ్బా నవ్వు తెప్పిస్తోంది. 
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments