Webdunia - Bharat's app for daily news and videos

Install App

తలకు తుపాకీ పెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.. భారత్‌కు పంపించేయండి..

తలకు తుపాకీ గురిపెట్టి పాకిస్థాన్ వ్యక్తి తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ ఓ 20ఏళ్ల భారతీయురాలు పాకిస్థాన్‌‍లోని భారత హైకమిషన్‌ను ఆశ్రయించింది. తనను తిరిగి భారత్‌కు (మాతృదేశానికి) పంపించేయాలని కోరి

Webdunia
మంగళవారం, 9 మే 2017 (10:52 IST)
తలకు తుపాకీ గురిపెట్టి పాకిస్థాన్ వ్యక్తి తనని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ ఓ 20ఏళ్ల భారతీయురాలు పాకిస్థాన్‌‍లోని భారత హైకమిషన్‌ను ఆశ్రయించింది. తనను తిరిగి భారత్‌కు (మాతృదేశానికి) పంపించేయాలని కోరింది. ఉజ్మా అనే భారతీయ మహిళ తన పాకిస్థానీ భర్త తాహిర్ అలీపై ఇస్లామాబాద్ కోర్టులో వేధిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అన్న కేసును కూడా దాఖలు చేసింది. పైగా ఆమె తన వాంగూల్మాన్ని మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసింది.
 
తనకు తుపాకీ గురి పెట్టి పెట్టి బలవంతంగా తాహీర్ అలీ పెళ్లిచేసుకున్నాడని, తన ఇమ్మిగ్రేషన్ దస్తావేజులు కూడా లాక్కున్నాడని ఉజ్మా ఆరోపించింది. తనకు భద్రంగా భారత్‌కు పంపించేంత వరకు వెళ్లేది లేదని ఉజ్మా భారత హైకమిషన్‌లోనే కూర్చుండిపోయింది. ఇదిలా ఉంటే భారత్‌కు తనను తిప్పి పంపేయాలని ఉజ్మా తమ వద్దకు వచ్చిందని భారత్ హైకమిషన్ విదేశ వ్యవహారల మంత్రిత్వశాఖ తెలిపినట్లు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ప్రతినిధి నఫీజ్ జకారియా తెలిపారు. 
 
అయితే ఢిల్లీ యువతిని ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయంలో బంధీగా ఉంచారని.. ఆమెను వెంటనే విడిపించాలని తాహిర్ తెలిపాడు. మే 3న వీరి వివాహం జరిగింది. వివాహమయ్యాక ఉజ్మాకు వీసా కోసం ఇస్లామాబాద్‌‍లోని హై కమిషన్ భవనానికి వెళ్ళి, వీసా పత్రాలను సమర్పించగా.. అధికారుల ఆదేశంతో లోనికి వెళ్లిన ఉజ్మా ఇంకా బయటకు రాలేదని వాపోయాడు. కానీ ఉజ్మా మాత్రం తాహిర్ తనను బలవంతంగా వివాహమాడాడని ఆరోపిస్తోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments