Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో వ్యాపారమా? చైనాపై ప్రతీకారం తీర్చుకుంటాం : ట్రంప్ గర్జన

Webdunia
గురువారం, 9 జులై 2020 (08:11 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం అతలాకుతలమైపోయింది. ముఖ్యంగా, అగ్రరాజ్యం అమెరికా ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ఈ వైరస్ దెబ్బకు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సైతం కుదేలైంది. దీంతో ఈ వైరస్ పురుడు పోసుకున్న చైనాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కరోనా వైరస్‌ను చైనానే పుట్టించిందంటూ ఇప్పటికే అమెరికా గుర్రుగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో చైనాకు చెందిన టిక్ టాక్ యాప్‌ను నిషేధించే దిశగా అమెరికా యోచిస్తోంది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టతనిచ్చారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... కరోనా అనేది పెద్ద వ్యాపారమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో పాటు ప్రపంచం మొత్తానికి చైనా చేసిన పని చాలా అవమానకరమైనదని చెప్పారు. 
 
టిక్ టాక్‌ను నిషేధించే విషయంపై తమ పరిపాలనా విభాగం కసరత్తు చేస్తోందని తెలిపారు. చైనాపై ప్రతీకారం తీర్చుకుంటామని... అందులో టిక్ టాక్‌ను నిషేధించడం కూడా ఒక మార్గమన్నారు. మరోవైపు, ఇప్పటికే టిక్ టాక్‌తో పాటు 59 యాప్‌లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. అలాగే, చైనాపై హాంకాంగ్ దేశంలో ఉన్న వ్యతిరేకత కారణంగా ఆ దేశం నుంచి టిక్ టాక్ స్వచ్ఛంధంగా తప్పుకుంటున్నట్టు బుధవారం ప్రకటించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments