Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా - నవంబర్ 8 నుంచి అమల్లోకి

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (15:28 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అగ్రరాజ్యం అమెరికా అమలు చేస్తూ వచ్చిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసింది. భారత్ సహా పలు దేశాలపై విధించిన ఈ ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అదేసమయంలో కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. 
 
తాజా నిర్ణయం నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడంతో అమెరికా మొదటిసారి విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. 
 
‘అమెరికా ప్రయోజనాల దృష్ట్యా కొవిడ్ సమయంలో విధించిన ఆంక్షల్ని తొలగిస్తున్నాం. టీకా ఆధారిత అంతర్జాతీయ విమాన ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని అని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. 
 
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ నుంచి ఇచ్చినటువంటి మినహాయింపునే 18 ఏళ్ల లోపు పిల్లలకూ ఇచ్చింది. వ్యాక్సినేషన్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న సుమారు 50 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆంక్షల నుంచి వెసులుబాటు కల్పించింది. 
 
అయితే, వ్యాక్సిన్ వేయించుకోనివారు ప్రయాణం ప్రారంభమైన 72 గంటల్లోపు చేయించుకొన్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్‌ రిపోర్టును అందించాలి. పలు దేశాలపై పరిమితుల తొలగింపు గురించి సెప్టెంబర్‌లోనే శ్వేతసౌధం ప్రకటించింది. అలాగే విదేశీ ప్రయాణికుల పూర్తి స్థాయి వ్యాక్సినేషన్‌ గురించి విమానయాన సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను వెలువరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments