Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌పై అగ్రరాజ్యం కన్నెర్ర : ఎయిర్‌స్ట్రైక్‌లో రెండో అగ్రనేతను చంపేసింది...

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (20:04 IST)
ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా కన్నెర్రజేసింది. వైమానిక దాడులతో ఇరాన్‌లోనే అత్యంత శక్తివంతమైన రెండో స్థాయి నేతను హతమార్చింది. దీంతో ఇరాన్ - అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం మొదలైనట్టుగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. 
 
నిజానికి ఇరాన్‌తో పెట్టుకోవాలంటే అమెరికా పూర్వ అధ్యక్షులు వెనుకంజ వేసేవారు. కానీ, ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఇరాన్‌లో అత్యంత శ‌క్తివంత‌మైన రెండ‌వ స్థాయి నేత క‌మాండ‌ర్ సులేమానిని హ‌త మార్చారు. డ్రాన్‌తో దాడితో ఇరాక్‌లో అత‌న్ని ఏసేశారు. 
 
నిజానికి గ‌తంలో ఇరాన్‌లో కొన్ని సంద‌ర్భాల్లో అమెరికాకు వైరం ఏర్ప‌డింది. కానీ అప్ప‌ట్లో మాజీ అధ్య‌క్షులు జార్జ్ డ‌బ్ల్యూ బుష్ కానీ, బ‌రాక్ ఒబామా కానీ ఇరాన్‌పై దాడి చేసేందుకు వెన‌కాడారు. అయితే ట్రంప్ మాత్రం ఆ వైఖ‌రికి ఫుల్‌స్టాఫ్ పెట్టేశారు. త‌న స‌హ‌జ శైలిలోనే క‌మాండ‌ర్‌పై దాడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. బుష్‌, ఒబామా చేయ‌లేని ప‌నిని ట్రంప్ చేసార‌న్న గుర్తింపు వ‌చ్చేసింది.
 
అయితే, ఎందుకు సులేమానిని చంపార‌న్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎటువంటి ఇంటెలిజెన్స్ స‌మాచారం ఆధారంగా ఇరాన్ క‌మాండ‌ర్‌ను ఇరాక్‌లో హ‌త‌మార్చారో స్ప‌ష్టంగా తెలియ‌డంలేదు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 27వ తేదీన ఓ అమెరికా కాంట్రాక్ట‌ర్‌ను చంపేశారు. రాకెట్ దాడిలో ఆ ప్ర‌ఖ్యాత కాంట్రాక్ట‌ర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇరాన్ మ‌ద్ద‌తు ఇచ్చే ఓ మిలిటెంట్ సంస్థ ఆ కాంట్రాక్ట‌ర్‌ను రాకెట్ దాడితో చంపేసింది. బ‌హుశా దానికి ప్ర‌తీక‌రాంగానే సులేమానిని హ‌త్య చేశారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. సులేమాని హ‌త్య‌తో ఇరాన్‌, అమెరికా మ‌ధ్య యుద్ధం మొద‌లైంద‌న్న వార్త‌లు కూడా గుప్పుమంటున్నాయి.
 
ఈ హ‌త్య‌తో మిడిల్ ఈస్ట్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకునే ప్ర‌మాదం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. సులేమానిని చంప‌డాన్ని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదంగా ఇరాన్ వ్యాఖ్యానించింది. మ‌ధ్య‌ప్రాశ్చ్య దేశాల్లో అశాంతిని ర‌గిలించ‌డం త‌న ఉద్దేశం కాద‌ని ట్రంప్ అన్నారు. యుద్ధం కాదు, శాంతిని కోరుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే, ఈ హత్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments