Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. టాంజానియాలో కొత్త వ్యాధి.. రక్తపు వాంతులు.. 15మంది మృతి

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (09:36 IST)
Tanzania
కరోనా మహమ్మారి తరువాత అనేక కొత్త వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా న్యూ స్ట్రెయిన్ బ్రిటన్ ను, అటు దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేస్తున్నది. బ్రెజిల్ లోనూ కొత్త స్ట్రెయిన్ తో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక ఇప్పుడు ఆఫ్రికా దేశం టాంజానియాలో ఓ కొత్త వ్యాధి భయపెడుతుంది. టాంజానియాలోని ఎంబేయా ప్రాంతంలోని ప్రజలు రక్తపు వాంతులు చేసుకుంటున్నారు. 
 
ఇలా రక్తంతో కూడిన వాంతులు చేసుకున్న గంటలోగా మరణిస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఆ ఎంబెయా ప్రాంతానికి ప్రత్యేక వైద్యబృందాలను పంపి వ్యాధిపై పరిశోధన చేస్తున్నారు. 
 
ఇప్పటి వరకు ఈ కొత్త వ్యాధితో 15 మంది మరణించగా, 50 మందికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యశాఖ తెలిపింది. అయితే, ఈ వింత వ్యాధి మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందలేదని, శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లో టెస్టింగ్ చేస్తున్నట్టు టాంజానియా వైద్యశాఖ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments