Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త తిరుగుళ్లు-భార్య ఫోన్‌‌కు నోటిఫికేషన్లు: విడాకులు ఇచ్చేసింది.. ఉబెర్‌‌పై కేసు..?

ఉబెర్‌పై కొత్త కేసు దాఖలు అయ్యింది. ఈ కేసు విచారణకు కూడా రానుంది. తన భార్య విడాకులు ఇచ్చేందుకు ఉబెర్ నిర్వాకమే కారణమంటూ ఓ భర్త కోర్టుకెక్కాడు. అంతేకాకుండా రూ.300 కోట్లు డిమాండ్ చేస్తూ ఆ భర్త కోర్టులో

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (11:31 IST)
ఉబెర్‌పై కొత్త కేసు దాఖలు అయ్యింది. ఈ కేసు విచారణకు కూడా రానుంది. తన భార్య విడాకులు ఇచ్చేందుకు ఉబెర్ నిర్వాకమే కారణమంటూ ఓ భర్త కోర్టుకెక్కాడు. అంతేకాకుండా రూ.300 కోట్లు డిమాండ్ చేస్తూ ఆ భర్త కోర్టులో దావా వేశాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సాన్స్‌ లే సవోయిర్‌ అనే వ్యాపారి తరచుగా, ఉబెర్ క్యాబ్‌‌లలో ప్రయాణిస్తుంటాడు. ఓసారి తన ఫోన్ నుంచి కాకుండా, తన భార్య ఫోన్ ఉపయోగించి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆపై అతని భార్య ఫోన్‌‌కు నోటిఫికేషన్లు ప్రారంభమయ్యాయి. 
 
అదే ఫోనుకు భర్త ఎక్కడ తిరుగుతున్నాడన్న సమాచారం మొత్తం ఆమెకు తెలిసిపోవడం మొదలైంది. యాప్ నుంచి లాగౌట్ అయినా, సాంకేతిక లోపాల కారణంగా నోటిఫికేషన్లు రావడం ఏమాత్రం ఆగలేదు. దీంతో తన భర్త బాగోతాన్ని.. ఆయన తిరుగుళ్లను తెలుసుకున్న భార్య అతనికి విడాకులు ఇచ్చేసింది. దీనిపై  సదరు భర్త కోర్టు మెట్లెక్కాడు. తన భార్య తన నుంచి విడిపోవడానికి, విడాకులు ఇచ్చినందుకు ఉబెర్ యాజమాన్యమే కారణమని విమర్శించాడు. తన వ్యక్తిగత ప్రైవసీని ఉబెర్ యాప్‌ దెబ్బతీసిందని 45 మిలియన్‌ డాలర్లు పరిహారం ఇవ్వాలని కేసు దాఖలు చేశాడు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments