Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ సైనిక అధికారులను ఉరి తీయండి... తీరు మార్చుకోండి, లేదంటే తొక్కేస్తాం... యూఎఇ వార్నింగ్

పాకిస్తాన్ దేశానికి చివరి ఘడియలు దగ్గరపడ్డాయా...? ఉగ్రవాద దేశంగా ముద్ర పడిపోయిందా...? ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా పాకిస్తాన్ దేశంపైన యుద్ధం చేస్తాయా...? అంటే అవుననే అభిప్రాయాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. తాజాగా యూరోపియన్ యూనియన్ ఉపాధ్యక్షుడు రిజర్డ్ జర్

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (14:27 IST)
పాకిస్తాన్ దేశానికి చివరి ఘడియలు దగ్గరపడ్డాయా...? ఉగ్రవాద దేశంగా ముద్ర పడిపోయిందా...? ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా పాకిస్తాన్ దేశంపైన యుద్ధం చేస్తాయా...? అంటే అవుననే అభిప్రాయాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. తాజాగా యూరోపియన్ యూనియన్ ఉపాధ్యక్షుడు రిజర్డ్ జర్నెకి పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు. 
 
బలోచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందనీ, పాకిస్తాన్ అక్కడి పౌరులను ఊచకోత కోస్తూ రాక్షసంగా ప్రవర్తిస్తోందనీ, తక్షణం పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోనట్లయితే ఆ దేశం పట్ల తాము అనుసరిస్తున్న విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశంతో ఉన్న ఆర్థిక, రాజకీయ ద్వైపాక్షిక సంబంధాలపై పునఃసమీక్షించుకుని తగు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
 
జెనీవాలో బ‌లోచిస్తాన్ స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధులు చేస్తున్న ధ‌ర్నాకు యూఎఇ ఉపాధ్యక్షులు మద్దతు పలకడం పాకిస్తాన్ కు మింగుడుపడటం లేదు. మరోవైపు భారతదేశం బలోచిస్తాన్ నేతలకు ఆశ్రయం కల్పించేందుకు ఆసక్తి చూపించడం పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఐతే పాకిస్తాన్ తీవ్రవాదులను పెంచి పోషించడాన్ని ఇకనైనా ఆపకుంటే దానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే హెచ్చరికలు ప్రపంచ దేశాల నుంచి వస్తున్నాయి. 
 
బలోచిస్తాన్‌లో దారుణాలకు పాల్పడుతున్న పాక్ సైనికాధికారులను ఉరి తీయాలంటూ బ‌లోచిస్తాన్ రిప‌బ్లిక‌న్ పార్టీ చీఫ్ బ్ర‌హుమ్‌దాగ్ బుగ్తి జెనీవాలో డిమాండ్ చేశారు. తమ దేశంలో జరుగుతున్న దారుణాలను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments