Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..? ఈ పరిణామాలు దేనికి సంకేతం..?

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (14:30 IST)
ఇరాన్‌లో అమెరికా సైనిక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడిలో ఇప్పటికే ఇరాన్ అగ్రస్థాయి కమాండర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ హత్యకు గురయ్యారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమోనని చర్చ సాగుతోంది. 
 
అమెరికా బాంబు దాడిలో సులేమానీ హతమైన తర్వాత గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సులేమానీ ఆ దేశంలోని రెండో శక్తివంతమైన నేతగా పేరొందారు. ఆయన నేరుగా ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ హయతుల్లా ఖమేనికి మాత్రమే జవాబుదారీగా ఉండేవారు.
 
కాగా, తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశం మేరకే ఈ దాడి జరిపినట్టు స్పష్టంగా చెప్పడంతో ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలాది అమెరికన్లపై దాడులు చేసిన సులేమానీని ఎప్పుడో చంపాల్సిందని ట్రంప్‌ పేర్కొనగా.. తీవ్రమైన ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. దీంతో అమెరికా-ఇరాన్‌ మధ్య ఒక్కసారిగా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. 
 
బరాక్‌ ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని అమెరికా రెండేళ్ళ కిందట అర్ధంతరంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ట్రంప్‌ ప్రభుత్వం ఇరాన్‌ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో విబేధాలు పతాక స్థాయికి చేరాయి. ఇంకా కుడ్స్‌ ఫోర్స్‌ను ఉగ్రవాద సంస్థగా, సులేమానీని ఉగ్రవాదిగా ప్రకటించింది అమెరికా. దీంతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమోనని వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments