Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌‍కు డ్రోన్లతోపాటు సైన్యాన్ని కూడా పంపించిన టర్కీ

ఠాగూర్
బుధవారం, 14 మే 2025 (14:39 IST)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధం కోసం పాకిస్థాన్ తరపున యుద్ధ క్షేత్రంలో పోరాడేందుకు టర్కీ తమ అత్యాధునిక డ్రోన్లతో పాటు సైన్య బలగాలను కూడా పంపించింది. ముఖ్యంగా డ్రోన్ల వాడకంపై పాకిస్థాన్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ టర్కీ సైనికులు పాకిస్థాన్‌‍కు వెళ్లారు. తాజాగా ఈ విస్తుగొలిపే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింద. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో చనిపోయిన పాకిస్తాన్ సైనికుల్లో ఇద్దరు టర్కీకి చెందిన వారు కూడా ఉండటం  గమనార్హం. 
 
పాకిస్థాన్ టర్కీల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు ఇటీవల భారీగా పెరిగాయి. భారత్‌పై దాడికి పాకిస్థాన్, టర్కీకి చెందిన వందల సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించింది. అయితే, వాటి వినియోగంపై అవగాహన కల్పించడానికి తమ మిలిటరీకి చెందిన వ్యక్తులను ఇస్లామాబాద్‌కు టర్కీయే పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ భారీ స్థాయిలో భారత్‌పై డ్రోన్ దాడులు చేసింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత్ కూల్చివేసింది. ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. అవన్నీ టర్కీయేకు చెందిన ఆస్ఫి గార్డ్ సోనగర్ డ్రోన్లను ధృవీకరించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kesari2 : అక్షయ్ కుమార్ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments