Webdunia - Bharat's app for daily news and videos

Install App

వలస ప్రజల చమట, నెత్తుటితో బతికిన దొడ్డ దేశం ఆ వలసలనే వద్దంటోంది

వలస ప్రజల చమట, నెత్తుటితో బతుకు నేర్చుకున్న దొడ్డ దేశం అమెరికా. ఇప్పుడు ఒక మూర్ఖ శిఖామణి చేతుల్లోపడి ఆ నెత్తుటి చరిత్రకే కళంకం తెచ్చుకుంటోంది. ప్రపంచ దేశాల శారీరక, మానసిక శ్రమతోడుగా పెరిగి పెద్దదైన అమ

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (07:32 IST)
వలస ప్రజల చమట, నెత్తుటితో బతుకు నేర్చుకున్న దొడ్డ దేశం అమెరికా. ఇప్పుడు ఒక మూర్ఖ శిఖామణి చేతుల్లోపడి ఆ నెత్తుటి చరిత్రకే కళంకం తెచ్చుకుంటోంది. ప్రపంచ దేశాల శారీరక, మానసిక శ్రమతోడుగా పెరిగి పెద్దదైన అమెరికా ఇప్పుడు పిదపబుద్దుల పాలకుల దుష్ట చర్యలతో బయటి దేశాల ప్రజలను ముఖ్యంగా ముస్లిం దేశాలను ఘోరంగా అవమానిస్తూ దేశంలోకి ప్రవేశం నిషేధించింది. ఆ కఠోర నిర్ణయం రేపటి ఉగ్రవాదానికి నాంది పలుకనుందని దేశదేశాల మేధావులు గొంతెత్తి అరుస్తున్నా అమెరికా నూతన పాలకుడు చలించటం లేదు. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము కోరుకోవడం లేదు. అమెరికాకు మద్దతిచ్చే, ప్రేమించే ప్రజలే ఇక్కడకు రావాలని కోరుకుంటున్నాం’ అని వక్ర భాష్యమివ్వడం ద్వారా దేశాధ్యక్షుడు కనీవినీ ఎరుగని వివక్షతకు నాంది పలికేశారు. దేశం, మతం, జాతి వివక్ష లేకుండా శరణార్థులను స్వాగతించే చరిత్ర ఉన్న అమెరికా దానిని అలాగే కొనసాగించాలని ట్రంప్‌కు ఐక్యరాజ్యసమితి అనుబంధ శరణార్థి విభాగం, యూఎన్‌హెచ్‌సీఆర్‌, శరణార్థుల అంతర్జాతీయ సంస్థ సంయుక్తంగా విజ్ఞప్తి చేసినా అమెరికాధీశుడు పెడచెవిన పెట్టేశారు. ట్రంప్ ఆ నిర్ణయం తీసుకోవద్దు. వినగానే గుండె పగిలింది అని  పాకిస్తాన్ బాలికల హక్కుల నేత మలాలా విలపించినా ఆ కసాయి గుండె కరగలేదు. ఇక మిగిలింది ప్రార్థనే.. దేవుడా రక్షించు అమెరికాను....
 
ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం చెప్పింది చెప్పినట్లు ఆచరణలో పెట్టేస్తున్నారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదుల్ని అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకుంటామన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై శనివారం సంతకం చేశారు. ఉత్తర్వు ప్రకారం అమెరికాలోకి సిరియా శరణార్థుల ప్రవేశాన్ని నిరవధికంగా నిషేధించారు. ఇతర దేశాల శరణార్థుల్ని ఆసాంతం పరిశీలించాకే అనుమతిస్తారు. వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్  పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తారు. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు ఆపేస్తారు. 
 
సంతకం చేశాక ట్రంప్‌ మాట్లాడారు. ‘ఇస్లామిక్‌ ఉగ్రవాదులను అమెరికా బయటే ఉంచేందుకు అత్యంత కఠినమైన నిబంధనలు తీసుకువస్తున్నాం. ఉగ్రవాదులు ఇక్కడ ఉండాలని మేము కోరుకోవడం లేదు. అమెరికాకు మద్దతిచ్చే, ప్రేమించే ప్రజలే ఇక్కడకు రావాలని కోరుకుంటున్నాం’అని ట్రంప్‌ పేర్కొన్నారు. 9/11 దాడులు నేర్పిన పాఠాల్ని ఎప్పుడూ మరవకూడదని చెప్పారు. ‘విదేశాల్లో జన్మించి అమెరికాలో ఉంటున్న అనేకమందికి ఉగ్ర నేరాల సంబంధాలపై శిక్షలు పడ్డాయి. శరణార్ధి ఒప్పందంలో భాగంగా అమెరికాలోకి ప్రవేశించిన వారికీ నేరాలతో సంబంధాలు ఉన్నాయి’ అని ఉత్తర్వుల్లో వెల్లడించారు.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలిచ్చిన కొన్ని గంటల్లోనే వలసదారులకు కష్టాలకు మొదలయ్యాయి. ఉగ్రవాద బెడద ఉన్న కొన్ని ముస్లిం దేశాల పౌరుల వలసపై ఆంక్షలు విధించే ఆదేశాలపై ట్రంప్ శుక్రవారం మధ్యాహ్నం సంతకం చేశారు. ‘‘ఒక్కసారిగా అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన వలసదారులను విమానాశ్రయాల్లోనే అడ్డుకుంటున్నారు. తిరిగి వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నార’’ని అరబ్-అమెరికన్ వివక్ష వ్యతిరేక కమిటీ పేర్కొంది. ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమన్ దేశాల నుంచి కొత్తవారిని ప్రవేశించకుండా ఆపడమే కాదు.. అమెరికాలో గ్రీన్ కార్డు, విద్యార్థి లేదా ఉద్యోగ వీసాలపై నివసిస్తున్న ఈ ఏడు దేశాలకు చెందిన లక్షలాది మందిపై కూడా ట్రంప్ ఆదేశాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
 
ట్రంప్‌ సంతకంపై అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పలు దేశాల అధినేతలు తీవ్రంగా స్పందించారు. డెమొక్రటిక్‌ సెనెటర్‌ కమలా హారిస్‌ వ్యాఖ్యానిస్తూ... ‘హోలోకాస్ట్‌ (మారణహోమం) మెమొరియల్‌ డే’ రోజున ట్రంప్‌ సంతకం చేశారని, ఇది ముస్లింలపై నిషేధమేనని పేర్కొన్నారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం తనని కలచి వేసిందన్నారు.  ‘అనేక మంది అమెరికన్లలా నేనూ వలసదారుల వారసుడినే. అందుకు గర్వపడాలి. దేశానికి ప్రమాదం తలపెట్టే వారిపై మాత్రమే దృష్టి పెట్టాలి. శరణు కోరినవారికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాలి’ అని జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. అమెరికాకు ప్రతిభావంతుల్ని తీసుకురావడంలో ట్రంప్‌ నిర్ణయం అడ్డంకులు సృష్టిస్తుందని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ చెప్పారు. ట్రంప్‌ ఆదేశాలతో తమ కంపెనీలో కనీసం 187 మంది ఉద్యోగాలు కోల్పోతారని చెప్పారు.    
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments