Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ బుర్రలేని బిలియనర్.. స్టుపిడ్ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు: అల్-షబాబ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సోమాలియా ఉగ్రవాద సంస్థ విమర్శలు గుప్పించింది. డొనాల్డ్ ట్రంప్ బుర్రలేని బిలియనర్ అని సోమాలియా టెర్రరిస్టు సంస్థ అల్-షబాబ్ అభివర్ణించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుద

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (09:35 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సోమాలియా ఉగ్రవాద సంస్థ విమర్శలు గుప్పించింది. డొనాల్డ్ ట్రంప్ బుర్రలేని బిలియనర్ అని సోమాలియా టెర్రరిస్టు సంస్థ అల్-షబాబ్ అభివర్ణించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయిన అల్-షబాబ్‌పై మిలటరీ ఆపరేషన్స్‌కు ట్రంప్ అనుమతి ఇచ్చారు. దీంతో ఆ సంస్థపై వాయుదాడులకు అవకాశం ఏర్పడింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల్లో సోమాలియా కూడా ఉంది. 
 
అల్-షబాబ్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా నిర్ణయించిన నేపథ్యంలో అమెరికా ఓటర్లు ఓ స్టుపిడ్ అధ్యక్షుడిని ఎన్నుకున్నారని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చునని వీడియోలో పేర్కొంది. అమెరికాను గొప్పగా తీర్చిదిద్దుతానంటూ ట్రంప్ చెప్తున్నది.. ఈ భూమ్మీదే అతిపెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేసింది. 
 
ఇదిలా ఉంటే... కెన్యాలో మరి కొద్దిరోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అల్‌-షబాబ్‌ దాడులకు వ్యూహం పన్నింది. దీంతో తీవ్రవాదులతో కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యెట్టా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments