Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న ఫేస్‌బుక్.. బొమ్మ కనిపిస్తే చాలు..

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (18:05 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఫేస్‌బుక్ వదిలిపెట్టేలా లేదు. కేపిటల్ హిల్ సంఘటనలో అల్లరి మూకలను ట్రంప్ ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడంతో ఆయనపై ఫేస్‌బుక్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లను ట్రంప్ ప్రోత్సహించినట్లు గుర్తించడంతో ఫేస్‌బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్, యూట్యూబ్ ట్రంప్‌ను తమ వేదికలను వాడుకోకుండా నిషేధించాయి. ఈ నిషేధాన్ని ఉపసంహరించే ఆలోచన ఏదీ లేదని ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ సాండ్‌బెర్గ్ చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ను వాడుకోనీయకుండా.. ట్రంప్‌కు చుక్కలు చూపిస్తోంది. ఆ వేదికను ఏదో ఒక విధంగా వాడుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తుంటే, అలాంటి ప్రయత్నాన్ని పసిగట్టిన వెంటనే ఫేస్‌బుక్ తీవ్రంగా స్పందిస్తోంది. తాజాగా ట్రంప్ తన కోడలి ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్షమవగానే, ఆ వీడియోలను ఫేస్‌బుక్ తొలగించి, హెచ్చరించింది. 
 
డొనాల్డ్ ట్రంప్ తన కుమారుడు ఎరిక్ ట్రంప్‌ సతీమణి లారా ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేయించారు. ట్రంప్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఈ వీడియోను లారా ట్రంప్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. వెంటనే ఆమెకు ఫేస్‌బుక్ నుంచి ఓ ఈ-మెయిల్ వచ్చింది. ఈ వీడియోలో డొనాల్డ్ ట్రంప్ వాయిస్ ఉన్నందువల్ల దీనిని తొలగించినట్లు తెలిపింది. ఇటువంటి వీడియోలను పోస్ట్ చేస్తే అదనపు ఆంక్షలు కూడా విధిస్తామని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments