Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్‌పై ఉక్కుపాదం.. పుతిన్‌తో గంటసేపు మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. పక్కా ప్లాన్?

ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ ప్రపంచ దేశాల నోళ్ళల్లో నానుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఐఎస్‌పై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతున్నారు. గత పాలకులు అవలంబించిన విధానాలతో పోలిస్తే, ఉగ్రవాదం

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (14:27 IST)
ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ ప్రపంచ దేశాల నోళ్ళల్లో నానుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఐఎస్‌పై ఉక్కుపాదం మోపేందుకు సన్నద్ధమవుతున్నారు. గత పాలకులు అవలంబించిన విధానాలతో పోలిస్తే, ఉగ్రవాదంపై తాను కఠినంగా ఉంటానన్న విషయాన్ని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు.
 
దాదాపు గంటపాటు జరిగిన సంభాషణలో, సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సంయుక్త దళాలను పంపే దిశగా చర్చలు సాగినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. రష్యా, అమెరికాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని తేలిక పరిచేలా ఇరు దేశాల అధినేతలూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు ఐఎస్ఐఎస్‌ను ఎలా ఓడించాలన్న విషయమై వ్యూహాన్ని రచించాలని పెంటగాన్‌ను ట్రంప్ ఆదేశించారు. ఇదే సమయంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ను పునర్వ్యవస్థీకరించాలని కూడా ఆయన సూచించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments