Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్‌ను ఉత్పత్తి చేసే చెట్లు ఎక్కడున్నాయ్.. రేటెంతో తెలుసా?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2016 (15:20 IST)
సాధారణంగా చెట్లు మనకు నీడ, గాలి ఇస్తాయి. కానీ చెట్లు కరెంటును ఇస్తాయంటే ఎవ్వరూ నమ్మరు. అసలు విషయమేంటంటే ఫ్రాన్సుకు చెందిన న్యూవిండ్ సంస్థ కృత్రిమ చెట్ల ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేసి రికార్డులు సృష్టిస్తోంది. ఇందుకోసం ప్రాథమిక నమూనాగా ఓ విండ్ ట్రీను ఫ్రాన్స్‌లోని బ్రిటనీ నగరంలో ఏర్పాటు చేశారు. 26 అడుగుల ఎత్తుండే ఈ విండ్ ట్రీలను ఫ్రాన్స్‌కు చెందిన న్యూవిండ్ సంస్థ డిజైన్ చేసింది. 
 
గాలి ఏ దిశ నుంచి వీచినా ఈ కృత్రిమ చెట్లు కరెంటును ఉత్పత్తి చేస్తాయట. వీటి ఆకులు గాలిమరల్లా పనిచేస్తాయి. వాటి ఆకులే గాలిమరల్లా పని చేస్తాయని, చిన్నపాటి గాలి వీచినా ఆకులు తిరుగుతాయని, అప్పుడు విద్యుత్‌ను తయారుచేసుకోవచ్చని న్యూవిండ్ సంస్థ వ్యవస్థాపకుడు మిచాడ్ అధికారికంగా వెల్లడించారు. 
 
ఆ చెట్లను రోడ్డు పక్కన లేదా పార్కుల్లో ఇలా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఒక్కో విండ్ ట్రీ ధర రూ.23 లక్షలు అని చెప్పారు. వాటితో వీధి దీపాలకు ఈ చెట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటునే వాడుకోవచ్చని మిచాడ్ తెలిపారు. భవిష్యత్తులో ఈ చెట్లను ప్రజలు ఇళ్లలో కూడా ఏర్పాటు చేసుకుంటారని తాను భావిస్తున్నానని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments