Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటీష్ టూరిస్ట్ తీసిన సెల్ఫీ అదరహో... నెటిజన్లంతా ఫిదా అయిపోయారు

ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్‌. ఎక్క‌డ చూసినా సెల్ఫీల పిచ్చోళ్లు. పిచ్చ పీక్ స్టేజ్ చేరింది. అవ‌స‌రంలేని అతి ప్రాణాలు తీసుకెళ్లి.. ప‌నికిరాని సెల్ఫీ ఒక‌టి మిగిల్చిపోతోంది. మార్కెట్ మాయ‌లోప‌డిన ప్ర

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (10:48 IST)
ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్‌. ఎక్క‌డ చూసినా సెల్ఫీల పిచ్చోళ్లు. పిచ్చ పీక్ స్టేజ్ చేరింది. అవ‌స‌రంలేని అతి ప్రాణాలు తీసుకెళ్లి.. ప‌నికిరాని సెల్ఫీ ఒక‌టి మిగిల్చిపోతోంది. మార్కెట్ మాయ‌లోప‌డిన ప్ర‌పంచం స్మార్ట్‌ఫోన్‌తో చేస్తున్న సావాసం.. స‌హ‌జీవ‌నం రాబోయే కాలంలో మ‌నిషిని పిచ్చోడిని చేసేంత ప్ర‌మాద‌కారిగా మార‌బోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అయితే ఇవేమీ ప‌ట్ట‌ని వేలం వెర్రి జ‌నం.. సెల్ఫీల‌తో త‌మ ప్రాణాల‌ను సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నారు. కాగా వీటన్నింటికి భిన్నంగా బ్రిటీష్ టూరిస్ట్ తీసుకున్న సెల్ఫీ అందరిని అబ్బురపరుస్తోంది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా వినియోగించుకుంటూ చక్కటి సెల్ఫీని తీసి అందరిచేత వాహ్వా అనిపించుకున్నాడు. అమెరికాలో న్యూయార్క్‌లోని ఎంపైర్‌స్టేట్ బిల్డింగ్‌పై సెల్ఫీ తీసుకోవడం అందరికీ ఓ క్రేజ్. 
 
కానీ, బ్రిటీష్ టూరిస్ట్ తీసిన సెల్ఫీలా ఇప్పటివరకు ఎవ్వరూ తీయలేదు. 1250 అడుగుల ఎతైన భవనం.. దట్టంగా కమ్ముకున్న మేఘాలు, న్యూయార్క్ నగరం వీటిని 360 డిగ్రీల కోణంలో చూపిస్తూ చక్కగా తీసిన ఫొటో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. అంద‌రి కంటే వింత‌గా, అంద‌రి కంటే ముందుగా, స‌రికొత్త‌గా ఓ సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అతను తీసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాట్నాలో పుష్ప-2 ది రూల్‌ ట్రైలర్‌ లాంచ్‌ కు ఏర్పాట్లు

కోర్టు రూములో వచ్చే ఉద్వేగం మూవీ సక్సెస్ కావాలి: రామ్ గోపాల్ వర్మ

కోమటిరెడ్డిని రావద్దన్న సినీపెద్దలు - సినీకార్మిలకు ఇచ్చిన హామీలు నీటిమూటలేనా?

ధూం ధాం లో మ్యూజిక్, కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు : రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్

రాజమౌళి - మహేశ్ బాబు చిత్రం బడ్జెట్ రూ.1000 కోట్లా? తమ్మారెడ్డి ఏమంటున్నారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments