నాసాపై ట్రోలింగ్.. డెస్క్‌పై దేవుళ్ళ బొమ్మలు.. ట్రోలర్స్‌కు షాక్

Webdunia
బుధవారం, 14 జులై 2021 (10:02 IST)
NASA
నాసా ఇటీవల చేసిన ఒక పని ఇంటర్ నెట్‌లో విపరీతంగా ట్రోల్ అవుతోంది. అది భారతీయ ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం కావడం గమనార్హం. నాసా ఇటీవల కొత్త ఇంటర్న్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సందర్భంగా తన మాజీ ఇంటర్న్‌ల కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. యూఎస్ అంతరిక్ష సంస్థలో పనిచేస్తున్న ప్రజల వైవిధ్యాన్ని ప్రదర్శించాలనే ఆలోచనతో ఈ పని చేశారు. అయితే, ఈ ప్రయత్నాన్ని విమర్శిస్తూ అనేకమంది నాసాను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
 
ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే.. మొత్తం నలుగురు ఇంటర్న్‌ల చిత్రాలను నాసా షేర్ చేసింది. వీరిలో ఒకరు భారతీయ అమెరికన్ అమ్మాయి. ఈమె నాసా లోగోతో ఉన్న ఊలుకోటు ధరించి కూర్చుని ఉన్నారు. ఆమె పక్కన డెస్క్‌పై హిందూ దేవుళ్ళ బొమ్మలు వెనుక గోడపై దేవుళ్ళ చిత్ర పటాలు ఉన్నాయి. వాటిని చూసిన నెటిజన్లు ఒక రేంజిలో నాసాపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. 
 
యూఎస్ అంతరిక్ష సంస్థ ఒక శాస్త్రీయ సంస్థ అని అంటున్న నెటిజన్లు.. ఏవిధంగా దేవుణ్ణి విశ్వసించే వారిని తన ఇంటర్న్ షిప్‌కు అనుమతిస్తారంటూ ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా కొందరు మితిమీరి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో కొన్ని హిందూఫోబియాను సూచించే విధంగా కూడా ఉన్నాయి.
 
అయితే, నాసాకు ఈ ట్రోలింగ్ విషయంలో అదేస్థాయిలో మద్దతు వచ్చింది. ట్రోలర్స్‌ను ఎదుర్కుంటూ పలువురు నాసా తరఫున.. ఆ ఫోటోలోని అమ్మాయి తరఫున పోస్ట్‌లు పెట్టారు. ఆమె తన డెస్క్ మీద దేవుళ్ళ విగ్రహాలు ఉంచుకోవడంలో తప్పేముంది అంటూ ఎదురుదాడికి దిగారు. నాసా చేసిన పనిలో అస్సలు తప్పు లేదన్నారు. ఆమె వ్యక్తిగత పరిస్థితులను నాసా అడ్డుకోకపోవడం గొప్పవిషయం అంటూ సపోర్ట్ చేశారు. 
 
అంతేకాదు, ఇటువంటి పనికిమాలిన విషయాలపై ట్రోలింగ్ చేయకుండా పనికొచ్చే విషయాల గురించి ఆలోచించమని హితవు చెబుతూ కొందరు పోస్ట్ చేశారు. ఇలా ఎదురుదాడి మొదలవడంతో ట్రోలర్స్ వెనక్కి తగ్గారు. తమ కామెంట్ల జోరును ఆపేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments