Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్‌టాక్‌ భారీ విరాళం..రూ. వంద కోట్ల విలువైన సూట్లు, మాస్కులు అందిస్తామని హామీ

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:31 IST)
కరోనా వైరస్‌ కట్టడికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు టిక్‌టాక్‌ భారీ విరాళం ప్రకటించింది. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సుమారు నాలుగు లక్షల హజ్మత్‌ సూట్‌లు, రెండు లక్షల మాస్కులు సమకూర్చేందుకు సిద్ధమైంది.

వీటి విలువ సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరులో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని, వారు సురక్షితంగా ఉండటం అత్యవసరమని టిక్‌టాక్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు లక్షల ప్రత్యేక హజ్మత్‌ సూట్లు, రెండు లక్షల మాస్కులు వైద్యులకు అందించాలని నిర్ణయిం చినట్లు తెలిపింది.

కేంద్ర జౌళి శాఖ సహకారంతో తాము నిర్ణీత ప్రమాణాలతో కూడిన సూట్లు, మాస్కులు సిద్ధం చేశామని, వీటిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందజేయనున్నామని టిక్‌టాక్‌ వివరించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments