Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. మొసళ్ళ మధ్య బోట్ రైడ్

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (10:21 IST)
మొసలి అనే పదం వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. అలాంటి మొసలిని దగ్గర నుంచి చూసేందుకు చాలా మంది భయపడుతుంటారు. అందుకే మొసళ్లు ఉండే ప్రాంతానికి వెళ్లేందుకు ఎవరు కూడా సాహసం చేయరు. ఇక మొసళ్లు ఉండే నదిలోకి ఎవరు వెళతారు. కానీ, కొందరు వ్యక్తులు మాత్రం ఓ సాహసం చేశారు. మొసళ్ల గుంపు మధ్యలోంచి బోట్ రైడ్ నిర్వహించారు. ఈ వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
పదుల సంఖ్యలో మొసళ్లు ఉన్న నదిలో నుంచి ఓ బోటు ప్రయాణిస్తున్న వీడియో అది. అందులో బోటు ముందుకు వెళ్తున్న కొద్దీ దాన్ని మోటారు శబ్దానికి మొసళ్లు నది ఒడ్డుకు పరిగెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 
 
భర్త చేతిలోనే తుదిశ్వాస విడిచిన భార్య
 
అనారోగ్యం బారిన పడిన తన భార్యకు మెరుగైన వైద్యం చేయించేందుకు భర్త ఆస్పత్రికి బయలుదేరాడు. కానీ, కట్టుకున్న భార్య కళ్లముందే... మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది. భార్య చనిపోతుండటాన్ని చూసిన భర్త చేసిన రోదనలు మిన్నంటాయి. అక్కడి ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది. ఏపీలోని అమడగూరు మండలంలోని మామిడిమేకలపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరప్ప తన భార్య చౌడమ్మ (35) అనారోగ్యంతో బాధపడుతుండటతో ఆమెను వైద్య పరీక్షల కోసమని అనంతపురానికి తీసుకెళ్లేందుకు స్వగ్రామం నుంచి ఆటోలో ఓబుళదేవరచెరువుకు చేరుకున్నారు. 
 
ఓబుళదేవర చెరువు బస్టాండ్‌కు రాగానే ఆమె పరిస్థితి విషమంగా మారింది. బస్సు కోసం వేచి చూసేలోగా ఆమె మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని హత్తుకుని అతను బోరున విలపించడం అందరినీ కలిచివేసింది. కనీసం మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు కూడా అతని వద్ద డబ్బులు లేకపోవడంతో ప్రజలే చందాలు వసూలు చేసి శవాన్ని ప్రైవేటు వాహనంలో స్వగ్రామనికి చేర్చి ఔదార్యం చాటుకున్నారు. ఈ దృశ్యం స్థానికంగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments