Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఓ స్మార్ట్ దొంగ.. షట్టర్ తెరవకుండా.. నగలు దోచేశాడు..

చైనాలో ఓ స్మార్ట్ దొంగ ఎంత పనిచేశాడో తెలుసా.. షాపు షెట్టర్ పగులకొట్టకుండా.. గోడలు దూకకుండా.. స్మార్ట్‌గా చేతులకు పనిచెప్పి.. తన పని కానిచ్చేశాడు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ చైనా డాంగ్‌గువాన్ సిటీలో మ

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (12:11 IST)
చైనాలో ఓ స్మార్ట్ దొంగ ఎంత పనిచేశాడో తెలుసా.. షాపు షెట్టర్ పగులకొట్టకుండా.. గోడలు దూకకుండా.. స్మార్ట్‌గా చేతులకు పనిచెప్పి.. తన పని కానిచ్చేశాడు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ చైనా డాంగ్‌గువాన్ సిటీలో మే 13న ఓ నగల దుకాణంలో దొంగతనం జరిగింది. ఆ దొంగ ఏవిధంగా దోచుకెళ్లాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే. నగల దుకాణంలో దొంగతనం చేద్దామని వెళ్లిన దొంగ అర్థరాత్రి షాపు ముందు నేలపై పడుకున్నాడు.
 
షట్టర్‌ను మెల్లమెల్లగా తన చేతులతో పైకి నెడుతూ, తన శరీరాన్ని గట్టిగా ఒత్తుకుంటూ షాపులోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లగానే అలారం మోగింది. అయినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా వచ్చిన పని కానిచ్చాడు. ఓ ప్లాస్టిక్ బ్యాగులో బంగారు నగల్ని సర్దుకుని.. ఎలా లోపలికి పోయాడో.. అలాగే బయటికొచ్చాడు. కానీ తతంగమంతా సీసీటీవీలో రికార్డ్ అయింది. తెల్లారగానే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని షట్టర్‌లో తేడా చూసి ఖంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
 
స్మార్ట్ దొంగ దాదాపు 36 లక్షల విలువల నగలు చోరికి గురైనట్లు దుకాణం యజమాని పోలీసులకు చెప్పాడు. సీసీటీవీలో రికార్డయిన వీడియో ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments