Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసున్న మంచి దొంగ..

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (16:18 IST)
సాధారణంగా దొంగలు దొరికినంత దోచుకుని వెళ్లిపోతుంటారు. కానీ బీజింగ్‌లో ఒక దొంగ మాత్రం అందరి దీనికి భిన్నంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే చైనాలోని హేయువాన్ నగరంలో లీ అనే స్థానిక మహిళ డబ్బు డ్రా చేసుకోవడానికి ఏటీఎంకు వెళ్లింది. అప్పటికే ఆమెను అనుసరిస్తున్న ఒక దొంగ ఆమె డబ్బు తీసుకునే సమయంలో ఏటీఎంలోకి చొరబడి ఆమెను కత్తితో బెదిరించి ఆమె దగ్గర ఉన్న డబ్బంతా లాక్కొన్నాడు.
 
కత్తిని చూసి బెదిరిపోయిన మహిళ చేతిలో ఉన్నదంతా ఇచ్చేసింది. అయితే ఆ దొంగ మళ్లీ ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయమని చెప్పాడు. ఆమె అతను చెప్పినట్లే చేసింది. ఆ ఖాతాలో డబ్బు పూర్తిగా లేవని తెలుసుకున్న అతనిలో ఎందుకో మార్పు వచ్చింది. 
 
ఆమె వద్ద తీసుకున్న డబ్బు అంతా తిరిగి ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో కాస్త నెట్‌లో వైరల్ కావడంతో చూసిన వారంతా దొంగ మంచి తనాన్ని మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని శిక్షించవద్దు అంటూ కూడా పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments