Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవిడ్-19 మొబైల్ యాప్‌ను లాంచ్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (08:52 IST)
కొవిడ్-19 గైడెన్స్, అప్‌డేట్స్‌తో కూడిన మొబైల్ యాప్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లాంచ్ చేసింది. ఈ యాప్ పేరు డబ్ల్యూహెచ్ఓ కొవిడ్-19 అప్‌డేట్స్ (WHO COVID-19 Updates).

ఈ యాప్‌లో వైరస్ గురించి పూర్తి నమ్మదగిన సమాచారం ఉంటుంది. అయితే, ఇందులో కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి ఫీచర్ లేదు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కరోనా వైరస్ యాప్‌ను తీసుకొచ్చినప్పటికీ ఇది ప్రజల లభ్యత కోసం కాదు కాబట్టి యాప్ స్టోర్లు దీనిని తొలగించాయి.
 
డబ్ల్యూహెచ్ఓ కొవిడ్-19 అప్‌డేట్స్ యాప్‌లో తాజా స్థానిక సమాచారంతోపాటు స్థానిక సమాచారం ఆధారంగా రియల్ టైమ్ నోటిఫికేషన్స్ లభిస్తాయి. కరోనా వైరస్ అవుట్ బ్రేక్ గురించి తెలుసుకునేందుకు హోం స్క్రీన్‌పై దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య ఎప్పటికప్పుడు కనిపిస్తుంది.

అలాగే, ఆరోగ్యం విషయంలో పాటించాల్సిన విధానాలు కూడా ఇందులో ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19 రెస్పాన్స్ ఫండ్‌కు విరాళం ఇవ్వాలనుకున్న వారు ఈ యాప్ ద్వారా డొనేట్ చేయొచ్చు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments