Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాలిబన్లకూ చాన్స్ ఇచ్చారు.. మరి నాసంగతేంటి....?

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (23:20 IST)
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా రాష్ట్రం ఫెడరల్ కోర్టులో మరో పిటిషన్ వేశారు. తాత్కాలికంగానైనా తన ట్విటర్‌పై ఖాతాను మళ్లీ ప్రారంభించాలంటూ కోర్టును కోరారు.

ఈ మేరకు ట్విటర్‌పై ఒత్తిడి పెంచాలని న్యాయమూర్తిని అభ్యర్ధించారు. అమెరికా చట్టసభల వేదిక క్యాపిటల్ హిల్‌‌ను ట్రంప్ మద్దతుదారులు ముట్టడించి రచ్చరచ్చ చేసిన అనంతరం..పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ట్రంప్ ఖాతాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నిషేధానికి వ్యతిరేకంగా ట్రంప్ గతంలోనే కేసు వేశారు.
 
తాజాగా ఆయన మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ చర్యలను నిలిపివేసేలా సోషల్ మీడియా వేదికలను ఆదేశించాలంటూ కోర్టులో ఇంజంక్షన్ కేసు పెట్టారు.

‘‘ట్వీట్ చేసేందుకు తాలిబన్లకు అవకాశం ఇచ్చిన ట్విటర్ నా అకౌంట్‌ను మాత్రం నిషేధించింది. తాలిబన్ల తమ విజయాలను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు.

అయితే..నేను మాత్రం అప్పట్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశానని, హింసను ప్రోత్సహించానని ట్విటర్ నా ఖాతాను స్తంభింపచేసింది. అప్పటికీ నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాను. ’’ అని ట్రంప్ తన అప్పీలులో పేర్కొన్నారు. 

‘‘అమెరికాలో రాజకీయ చర్చలపై ట్విటర్ అమితమై పట్టుకలిగి ఉంది. చరిత్రలో మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఇది స్వేఛ్చాయుత ప్రజాస్వామిక చర్చలపై పెను ప్రభావం చూపుతుంది’’ అని ట్రంప్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments