అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ప్రస్తుతం ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. హెచ్-1బీ వీసా చట్ట సవరణ రూపంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురుకాబోతున్న ముప్పుకు భారత ఐటీ దిగ్గజాలన్న
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ప్రస్తుతం ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. హెచ్-1బీ వీసా చట్ట సవరణ రూపంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురుకాబోతున్న ముప్పుకు భారత ఐటీ దిగ్గజాలన్నీ గజగజలాడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ముస్లింలపై కొరడా ఝుళిపించిన డొనాల్డ్ ట్రంప్‌పై సిరియా ప్రాంత ప్రజలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇలా ఎవ్వరికీ భయపడకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న డొనాల్డ్.. తన హెయిర్ స్టైల్ మీద ప్రత్యేక కేర్ తీసుకుంటారని తెలిసింది.
డొనాల్డ్ ట్రంప్ అందమైన హెయిర్‌స్టైల్‌ను మెయిన్‌టైన్ చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు డా.హరాల్డ్ బార్న్‌స్టెయిన్ ట్రంప్ హెయిర్ స్టైల్ సీక్రెట్‌ను బయటపెట్టారు. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయడమే కాదు జుట్టు పెరుగుదల కోసం ప్రోస్టేట్ సంబంధిత డ్రగ్‌ను తీసుకుంటారని హరాల్డ్ తెలిపారు. అలాగే చర్మ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఆంటీ బయోటిక్స్ మందులు కూడా తీసుకుంటారని.. గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచేందుకు మందులు వాడతారని హరాల్డ్ తెలిపారు.
ఇకపోతే.. సాధారణంగా శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ డీహెచ్‌టీగా మారుతుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకుండా డీహెచ్‌టీ అడ్డుపడుతుంది. దాంతో ఎక్కువగా పురుషుల్లో జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడుతుంది. అందుకే టెస్టోస్టిరాన్ హార్మోన్ 'డీహెచ్‌టీ'గా మారకుండా ఉండేందుకు వీలుగా డ్రగ్‌ను ట్రంప్ తీసుకుంటారని హరాల్డ్ తెలిపారు.